బాలీవుడ్ స్టార్ తో మెగా ప్రొడ్యూసర్ మూవీ.. బడ్జెట్ ఎంతో తెలుసా..?

shami
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తన 40 ఏళ్ళ సిని కెరియర్ లో హడావిడిగా సినిమాలు తీయకుండా ఆచితూచి తీస్తారు. కథ, బడ్జెట్, స్టార్ కాస్ట్ ఇలా అన్నిటిని పర్ఫెక్ట్ గా చూసుకుని అల్లు అరవింద్ సినిమాలు చేస్తారు. అవసరమైన కథకు అవసరమైన బడ్జెట్.. క్వాలిటీ విషయంలో రాజీ పడని సంస్థ అందుకే ప్రతి నటుడు గీత ఆర్ట్స్ లో ఒక్క సినిమా అయినా చేయాలని అనుకుంటాడు. అక్కడ హిట్టు పడితే మాత్రం వరుసగా ఛాన్సులు వచ్చినట్టే.

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ మధ్య డైరెక్ట్ గా గీతా ఆర్ట్స్ లో సినిమాలు నిర్మించడం తక్కువ చేశారు. గీతా ఆర్ట్స్ 2లో బన్నీ వాసు ద్వారా మీడియం రేంజ్ సినిమాలు చేస్తున్నారు. ఇదిలాఉంటే లేటెస్ట్ గా అల్లు అరవింద్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పై నోరు విప్పారు. రామాయణ్ సినిమా ఎనౌన్స్ చేసి సైలెంట్ గా ఉన్న అల్లు అరవింద్. మరో పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు.

ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో నటిస్తారని.. ఇప్పటికే ఆ హీరోతో సంప్రదింపులు జరిపామని అన్నారు. ఈ సినిమాకు 170 కోట్ల దాకా బడ్జెట్ కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది. మరి అంత బడ్జెట్ పెట్టి తెలుగు హీరోలతో చేయకుండా బాలీవుడ్ హీరోతో అల్లు అరవింద్ సినిమా చేయడం ఎందుకని తెలుగు ఆడియెన్స్ అంటున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కే ఈ భారీ బడ్జెట్ సినిమాకు డైరక్టర్ ఎవరన్నది కూడా తెలియాల్సి ఉంది. అల వైకుంఠపురములో సినిమా నిర్మాణ భగస్వామ్యంలో ఉన్న అల్లు అరవింద్ ఆ సినిమా హిందీ రీమేక్ నిర్మించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.                                  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: