ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్, పునర్నవిల వివాహం అప్పుడే?

VAMSI
రాహుల్ సిప్లిగంజ్ ఓ పాప్ సింగర్, ఎన్నో అద్భుతమైన పాటలకు తన మధురమైన గాత్రాన్నిఇచ్చి, ఎన్నో సినిమాలు తన పాటల వల్లే హిట్టయ్యేంత రేంజ్ లోకి ఎదిగిపోయాడు ఈ తెలంగాణ పోరడు. అంతే కాకుండా కొన్ని ప్రైవేట్ సాంగ్స్ లో తనే ఆడి పాడి కొత్త కొత్తగా వీడియోలు చేస్తున్నాడు.  ఇదిలా ఉంటే గత సంవత్సరం బుల్లి తెరమీద చేసిన బిగ్ బాస్ షో తో పెద్ద స్టార్ గా ఎదిగి పోయాడు. ఈ షోలో  తనదైన పెర్ఫార్మెన్స్ తో తన ఇమేజ్ ను మరింత పెంచుకుని పెద్ద సెలబ్రిటీ గా మారిపోయాడు.  పునర్నవి భూపాలం ఉయ్యాల జంపాల పిట్టగోడ వంటి పలు చిత్రాలలో నటించి తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమైన అచ్చ తెలుగు అమ్మాయి. ఈమె కూడా బిగ్ బాస్ షో తో ఒక్కసారిగా తన కెరీర్ ను గొప్పగా మలుచుకుంది. ఈ అమ్మడు ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడే మనస్తత్వం ఉన్న వ్యక్తి. తన ఒరిజినాలిటీ తో మరింత క్రేజ్ పెంచుకుంది.

రాహుల్ మరియు పునర్నవిలు  ఇద్దరూ కలిసి బిగ్ బాస్ షోలో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారని, ఈ షో చూసిన వారందరికీ అర్థమవుతుంది. రాహుల్ అయితే పునర్నవిపై పెంచుకున్న ప్రేమని అస్సలు దాచుకోలేక పోయాడు.  ప్రేక్షకులు చూస్తుంటారు అనే సంగతి మరచి పునర్నవిపై ప్రేమ కురిపించాడు ఈ యువగాయకుడు. బుల్లితెరపై సుధీర్ రష్మీల జోడి తర్వాత మేడ్ ఫర్ ఈచ్ అదర్ పెయిర్ వీళ్లదే. వీరిద్దరి వివాహం ఒక ప్రశ్నార్థకంగా మారింది, వారి అభిమానులు ఆఫ్ స్క్రీన్ లో కూడా ఒకటవ్వాలని పెళ్లితో వీరి అనుబంధం మరింత బలపడాలని కోరుకుంటున్నారు.

అలాంటి ఈ జంటకి పెళ్లి కుదిరింది అంట, కుటుంబ సభ్యుల మధ్య లో ప్రేక్షకుల మధ్యలో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరగనుంది. అయితే ఇది రియల్ లైఫ్ లో కాదు ఈ వినాయక చవితి సందర్భంగా ఈటీవీ వారు నిర్వహించే "2020 అనుకున్నది ఒకటి అయినది ఒక్కటి" రియాలిటీ షోలోనిది. అందులో భాగంగా రాహుల్ సిప్లిగంజ్ పునర్నవి లకు ప్రేమ పెళ్లి చేస్తున్నట్లు డిజైన్ చేశారు. దీనికి ప్రముఖ సినీ సెలబ్రిటీలు సునీల్, రోజాలు ఈ పెళ్లికి పెద్దలు గా వ్యవహరిస్తున్నారు. మరి ఈ కార్యక్రమం సక్సెస్ అయి వీరిద్దరికీ మరింత పేరు రావాలని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: