పక్కన మగాడు కనిపిస్తే కథలు అల్లడమే..!

shami
తెలుగు తెర మీద క్యారక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించిన సురేఖా వాణి ఈమధ్య సినిమాలకు దూరంగా ఉంటున్నారు. బొమ్మరిల్లు సినిమా నుండి ఆచారి అమెరికా యాత్ర, తేజ్ ఐలవ్యూ వరకు సినిమాల్లో నటించిన సురేఖా వాణి ఇప్పుడు సినిమాల మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. దానికి కారణం యువ హీరోలకు కూడా తనని తల్లి పాత్రలు చేయమనడమే అని అంటుంది. అంతేకాదు మదర్ రోల్స్ కు మాత్రమే తనని తీసుకుంటున్నారని మిగతా పాత్రలు తాను చేయగలనని అంటుంది.

ఇక భర్త దూరమైన బాధలో ఉంటే తన పక్కన మగాడు కనబడితే చాలు స్టోరీస్ అల్లేస్తున్నారని అది తన బ్రదర్, తండ్రి ఎవరన్నది కూడా చూడకుండా రకరకాలుగా కథలు అల్లేస్తున్నారని అన్నది సురేఖా వాణి. ఇక తన కూతురిని హీరోయిన్ గా పరిచయం చేయడంపై వివరణ ఇచ్చింది సురేఖా. సుప్రితను హీరోయిన్ గా చేస్తానని తనకు ఆ ఇంట్రెస్ట్ ఉందని అంటున్నారు సురేఖా వాణి.    

టివి సీరియల్స్ లో నటించి సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా మారిన సురేఖా వాణి భర్త మరణించిన తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఎప్పటికప్పుడు ఫోటో షూట్స్ తో మాత్రం తన ఫ్యాన్స్ ను అలరిస్తున్నారు. మరి సురేఖా వాణి కోరుకునే ఆ స్పెషల్ రోల్స్ ఏంటన్నది తెలియాల్సి ఉంది. సుప్రిత హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తే మళ్ళీ తను కూడా క్యారక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగే ఆలోచనలో ఉంది సురేఖా వాణి. సురేఖా వాణి గురించి ఈమధ్య మీడియాలో రకరకాల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వాటికి తను చాలా హర్ట్ అవుతున్నట్టు చెబుతున్నారు సురేఖా వాణి.                            

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: