అబ్బో .... చాలా ఏళ్ళ గ్యాప్ తరువాత మహేష్ కు జోడీగా నటించనున్న జేజమ్మ ....??

GVK Writings
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన తొలి సినిమా అతడు. 2005 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అతి పెద్ద విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వారిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన రెండో సినిమా ఖలేజా, 2010 లో ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. మహేష్ బాబు అదిరిపోయే యాక్షన్, హీరోయిన్ అనుష్క అందం అభినయం, భారీ యాక్షన్, ఫైట్ సీన్స్ వంటివి ఈ సినిమాలో మంచి పేరు దక్కించుకున్నప్పటికీ సినిమా కథ, కథనాలను దర్శకుడు తెరకెక్కించిన విధానం ఏమాత్రం ఆసక్తికరంగా లేదని పలువురు ప్రేక్షకులు అప్పట్లో ఈ సినిమా పై బహిరంగంగానే పెదవి విరిచారు. ఆ విధంగా తొలిసారిగా మహేష్ బాబుతో నటించిన సినిమా ద్వారా అనుష్కశెట్టి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.  

ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు మహేష్ తో మరొక్కసారి అనుష్క నటించింది లేదు. ఇక లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం సర్కార్ వారి పాట సినిమా చేయడానికి సిద్ధమైన మహేష్ బాబు దాని అనంతరం రాజమౌళి సినిమాతో పాటు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. కాగా ఆ సినిమాలో హీరోయిన్ గా అనుష్కని ఎంపిక చేశారని లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. మాఫియా బ్యాక్ డ్రాప్ లో అత్యున్నత సాంకేతిక విలువలతో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉందని, కాగా అటువంటి పాత్రకు అనుష్క అయితేనే కరెక్ట్ అని భావించిన దర్శకుడు వంశీ, నిన్న ఫైనల్ గా ఆమెను ఎంపిక చేశారని, అలానే మహేష్ కూడా ఈ విషయమై గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు.  

ఇటీవల ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బాహుబలి రెండు సినిమాల అద్భుత సక్సెస్ ల తర్వాత అనుష్క, భాగమతి సినిమా తో మరో సక్సెస్ ని అందుకుంది. ఇక ప్రస్తుతం నిశ్శబ్దం అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లో నటిస్తున్న అనుష్క దానితో మరొక విజయాన్ని అందుకోవాలని చూస్తోంది. మరి ప్రస్తుతం విస్తృతంగా ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే, ఎన్నో ఏళ్ల గ్యాప్ తర్వాత మహేష్, అనుష్కల జోడీని మరొక్కసారి వెండితెరపై చూడవచ్చన్నమాట .....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: