అల వైకుంఠపురములో.. జ్ఞాపకాలు మర్చిపోలేకపోతున్న పూజా హెగ్దే..!

shami
కమర్షియల్ సినిమాకు కావాల్సిన అందాల ప్రదర్శన చేయడంలో ఏమాత్రం ఆలోచించని హీరోయిన్స్ కు ఎప్పుడు డిమాండ్ ఉంటూనే ఉంటుంది. అభినయం అనేది ఎలా ఉన్నా గ్లామర్ షో చేసే భామలకు కొంత క్రేజ్ ఉంటుంది. అలాంటి వారిలో చెప్పుకుంటే పూజా హెగ్దే ముందు ఉంటుంది. అల్లు అర్జున్ డిజే సినిమా నుండి అమ్మడ్ హవా చూస్తూనే ఉన్నాం. వరుస సినిమాలతో పూజా హెగ్దే అదరగొట్టేస్తుంది. సినిమాకు కోటిన్నర దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్న అమ్మడు దానికి తగినట్టుగా గ్లామర్ షో చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది.

ఈ ఇయర్ మొదట్లో అల వైకుంఠపురములో సక్సెస్ తో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న పూజా హెగ్దే సినిమా రిలీజై 8 నెలలు అవుతున్నా ఆ సినిమా జ్ఞాపకాల్లోనే ఉంది. లేటెస్ట్ గా తన సోషల్ బ్లాగ్ లో అల వైకుంఠపురములో సినిమాలో సింగిల్ టేక్ గా వచ్చిన పర్ఫెక్ట్ షాట్ ను షేర్ చేసింది అమ్మడు. ఇది సింగిల్ టేక్ వచ్చిన షాక్ అని.. తనకు బాగా గుర్తుందని చెప్పుకొచ్చింది పూజా హెగ్దే. అంటే సినిమా రిలీజై 8 నెలలు అవుతున్నా ఇంకా అమ్మడు అల వైకుంఠపురములో సినిమా జ్ఞపకాల్లోనే ఉందన్నమాట.  

ప్రస్తుతం పూజా హెగ్దే ప్రభాస్ తో రాధే శ్యామ్, అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాలు చేస్తుంది. ఈ సినిమాలతో పాటుగా మరో రెండు స్టార్ ప్రాజెక్టులు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయని తెలుస్తుంది. తెలుగులో టాప్ హీరోయిన్ గా తన సత్తా చాటుతున్న పూజా హెగ్దే లాక్ డౌన్ ముగిసింది కాబట్టి తను షూటింగ్స్ కు రెడీ అంటుంది. త్వరలోనే రాధే శ్యామ్ షూటింగ్ లో అమ్మడు పాల్గొనే ఛాన్సులు ఉన్నట్టు తెలుస్తుంది. రాధే శ్యాం సినిమా పిరియాడికల్ లవ్ స్టోరీగా వస్తుంది. సినిమాలో పూజా హెగ్దే డ్యుయల్ రోల్ లో నటిస్తుందని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: