సినిమా నటీనటుల వారసులు ఇండస్ట్రీలో జాగ్రత్తగా అడుగులు వేస్తుంటారు. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ పై ఆధారపడినా కూడా స్టార్ డమ్ కోసం వేచి చూస్తారు. డేరింగ్ డెసిషన్లు తీసుకోవడంలో వీరు చాలా వరకు వెనకే ఉంటారు. అయితే శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ మాత్రం డేరిగ్ గాళ్ గా మారింది. బాలీవుడ్ అంతా ఓ విధంగా ఆలోచిస్తుంటే ఆమె మాత్రం మరో విధంగా తన కెరీర్ మలచుకుంటోంది.
కరోనా లాక్ డౌన్ కాలంలో ప్రస్తుతం ఓటీటీలదే హవా. థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియదు, మరోవైపు టీకా వచ్చే వరకు సీనియర్లు షూటింగ్ లకు దూరం అంటున్నారు ఈ టైమ్ లో ఓటీటీలకోసం సినిమాలు చేస్తే తప్పేంటని ప్రశ్నిస్తోంది జాన్వీ కపూర్. ఓటీటీలతో బిజీ అయితే రేపు డైరెక్ట్ సినిమాల్లో ఎవరు తీసుకుంటారనే ఉద్దేశంతో చాలామంది అప్ కమింట్ ఆర్టిస్ట్ లు సినిమాలనే నమ్ముకుని ఓటీటీలకు దూరంగా ఉన్నారు. షూటింగ్ లు మొదలయ్యాకే పని ప్రారంభిద్దామని ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ఓటీటీలకు కమిట్ మెంట్లు ఇస్తే, రేపు సినిమాలుక కాల్షీట్లు ఇచ్చే సమయంలో ఇబ్బంది పడాల్సి వస్తుందనేది వారి ఆలోచన.
అయితే జాన్వి కపూర్ మాత్రం ఇలాంటి అభద్రతా భావాలను దగ్గర కానివ్వడంలేదు. ప్రస్తుతం ఓటీటీలదే హవా అంటున్న జాన్వి, సినిమాలను పక్కనపెట్టి అయినా ఓటీటీలోకోసం కాల్షీట్లిస్తానంటోంది. ఇటీవల జాన్వి కపూర్ లీడ్ రోల్ చేసిన గుంజన్ సక్సేనా ఓటీటీలో మంచి విజయం సాధించింది. అయితే సినిమాలో భారత వాయుసేనను కించపరిచారంటూ విమర్శలొచ్చాయి. కల్పిత కథ ఎక్కువైందని, ఎయిర్ ఫోర్స్ అధికారులు, మాజీ అధికారులు ఆరోపించారు. అప్పటికే సినిమా ఓటీటీలో రిలీజ్ కావడం, దానికి సెన్సార్ వంటి ప్రక్రియలు లేకపోవడంతో తప్పు జరిగిపోయాక విషయం బైటపడింది. ఇకపై అలాంటి తప్పులు చేయకుండా తాను కూడా జాగ్రత్తలు తీసుకుంటానంటోంది జాన్వీ కపూర్. ఓటీటీ ప్లాట్ ఫామ్ పై తన సత్తా చూపించడానికి సిద్ధమవుతోంది.