కంగనా రనౌన్ ఫైటింగ్ లో కీలక మలుపు.. !

NAGARJUNA NAKKA
కంగనారనౌత్ ఎవ్వరినీ విడిచిపెట్టడం లేదు. హీరోలు, దర్శకనిర్మాతలు అన్న తేడా లేకుండా అందరినీ కామెంట్ చేస్తూనే ఉంది. బాలీవుడ్ లో గ్యాంగ్స్ ఉన్నాయని హడావిడి చేస్తూనే ఉంది కంగన. ఈ హంగామాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు నజీరుద్దీన్ షా. దీంతో కంగన ఫైటింగ్ మరో మలుపు తీసుకుంది.

కంగనా రనౌత్ కెరీర్ బిగినింగ్ బోల్డన్ని స్టేట్ మెంట్స్ ఇచ్చింది. ఎంతపెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్నా ఆడియన్స్ ఓకే చేస్తేనే స్టార్స్ అవుతారు లేకపోతే జీరోలే అన్నట్లు మీడియా ఇంటరాక్షన్స్ లోనూ మాట్లాడింది. అయితే కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ రోల్స్ తగ్గిపోయి, లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో నటిస్తోన్న సమయంలో వారసత్వం గురించి మాట్లాడటం మొదలుపెట్టింది. ఇండస్ట్రీలో నెపోటిజం పెరిగిపోతోందని పోరాటాలు చేస్తోంది.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ చేసుకున్నాక నెపోటిజంపై మరింత దూకుడుగా కామెంట్స్ చేస్తోంది కంగనా రనౌత్. బాలీవుడ్ లో కొన్ని గ్యాంగ్స్ ఉన్నాయని, టాలెంట్ ని తొక్కేస్తున్నాయని విమర్శిస్తోంది. ఈ కామెంట్స్ ని బాలీవుడ్ స్టార్ నజీరుద్దీన్ షా దగ్గర ప్రస్తావించింది ఓ మీడియా హౌజ్. దీనికి సుశాంత్ కి న్యాయం చేస్తామంటూ బయల్దేరిన హాఫ్ నాలెడ్జ్ స్టార్లు చేసే కామెంట్స్ ని ఎవ్వరూ పట్టించుకోరు, చట్టం తన పని తాను చేస్తుందని రియాక్ట్ అయ్యాడు నజీరుద్దీన్ షా.

నజీరుద్దీన్ షా కామెంట్స్ కి కంగనా రౌత్ కూడా ఒక రేంజ్ లో రియాక్ట్ అయ్యింది. నా అవార్డ్స్... అచీవ్ మెంట్స్ ని చూడండి. ఇండస్ట్రీలో నాతో పాటున్న వారసురాళ్లు ఎవరైనా ఇన్ని పురస్కారాలు అందుకున్నారా.. అదే నేను ప్రకాశ్ పదుకొణే కూతురు దీపిక పదుకొణే, అనిల్ కపూర్ బిడ్డ సోనమ్ కపూర్ నో అయితే ఇలాగే కామెంట్ చేసేవాళ్లా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో టాలెంటెడ్ ఆర్టిస్ట్ నజీరుద్దీన్ షానే కామెంట్ చేసే స్థాయికి వెళ్లావా అంటూ కంగనాని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక నెటిజన్ల కామెంట్స్ తో కంగన నెపోటిజం ఫైట్ మరో టర్న్ తీసుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: