ఆచార్య ఫస్ట్ లుక్.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ హ్యాపీ..!

shami
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా నుండి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజైంది. కొన్నాళ్లుగా వినిపిస్తున్న ఆచార్య టైటిల్ నే కన్ఫాం చేస్తూ చిత్రయూనిట్ ఈరోజు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ చూసిన మెగా ఫ్యాన్స్ పండుగ చెసుకుంటున్నారు. మెగాస్టార్ బార్త్ డే కానుకగా వచ్చిన ఈ ఫస్ట్ లుక్ వారి ఉత్సహాన్ని రెట్టింపు చేసింది ఆచార్య ఫస్ట్ లుక్. ఇక ఇదిలాఉంటే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ చూసి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు.  

అదేంటి మెగాస్టార్ పోస్టర్ చూసి బన్నీ ఫ్యాన్స్ ఆనందంగా ఉండటం దేనికి అంటే చిరు ఆచార్య తర్వాత కొరటాల శివ చేసే సినిమా అల్లు అర్జున్ తోనే అని తెలిసిందే. ఆచార్య ఫస్ట్ లుక్ ఈ రేంజ్ లో ఉంటే సినిమా మరో రేంజ్ లో ఉంటుంది. ఇక ఆచార్య తర్వాత బన్నీతో చేసే సినిమా మరో లెవల్ లో ఉండబోతుందన్నట్టు అంచనా వేస్తున్నారు. అనుకున్నట్టుగానే ఆచార్య ఫస్ట్ లుక్ అదిరిపోగా సినిమా కూడా ప్రేక్షకులను మెప్పిస్తుందని చెప్పొచ్చు.

ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమా చేస్తున్నాడు. సుకుమార్ డైరక్షన్ లో తెరకెక్కే ఈ సినిమాలో బన్నీ మాస్ లుక్ తో దర్శనమిస్తున్నాడు. పుష్ప సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. పుష్ప తర్వాత కొరటాల శివతో అల్లు అర్జున్ సినిమా ప్లాన్ చేశారు. ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్ కూడా ఈమధ్య రిలీజైంది. ఆ సినిమా కూడా ఓ సోషల్ మెసేజ్ తో వస్తుందని తెలుస్తుంది. మొత్తానికి ఆచార్యతో మరోసారి అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో హుశారు రెట్టింపు అయ్యింది.      



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: