తమ్ముడి కోసం రంగంలోకి రౌడీ స్టార్.. !
విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ‘దొరసాని’తో హీరోగా లాంచ్ అయినప్పుడు బోల్డన్ని విమర్శలొచ్చాయి. రౌడీ బ్రదర్ పై సెటైర్లు కూడా పేల్చారు నెటిజన్ లు. అయితే విమర్శల్లో పడిన తమ్ముడి కెరీర్ ని గట్టెక్కించడానికి అన్నయ్య రంగంలోకి దిగుతున్నాడు. ఆనంద్ తో వెబ్ సీరీస్ నిర్మించబోతున్నాడట విజయ్.
విజయ్ దేవరకొండ యాక్టింగ్, రౌడీ బ్రాండ్ బిజినెస్ తో పాటు నిర్మాణంలోనూ ఉన్నాడు. ‘కింగ్ ఆఫ్ ది హిల్’ బ్యానర్ లో ‘మీకు మాత్రమే చెప్తా’ అనే సినిమా కూడా నిర్మించాడు. లైఫ్ ఇచ్చిన దర్శకుడు తరుణ్ భాస్కర్ ని హీరోగా పెట్టి ఈ చిత్రం నిర్మించాడు విజయ్. ఇప్పుడు తమ్ముడి ఆర్టిస్ట్ గా సెట్ చేసేందుకు ఒక వెబ్ సీరీస్ నిర్మించబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది.
ఆనంద్ దేవరకొండ ఈ లాక్ డౌన్ లోనే ‘మిడిల్ క్లాస్ మెలడీస్’ అనే సినిమాకి సైన్ చేశాడు. అయినా తమ్ముడి కెరీర్ కి బూస్టప్ ఇవ్వడానికి ఒక వెబ్ సీరీస్ తియ్యాలనుకుంటున్నాడట విజయ్. మరి అన్నయ్య తమ్ముడితో సినిమా తియ్యకుండా వెబ్ సీరీస్ వైపు వెళ్లడానికి కుర్రాళ్లే కారణమట. ఎందుకంటే కరోనా లాక్ డౌన్ తో కుర్రాళ్లంతా వెబ్ సీరీసులకి అడిక్ట్ అయ్యారు. సో ఆనంద్ తో వెబ్ సీరీస్ తీస్తే యూత్ ఫాలోయింగ్ వస్తుందని ఫీలవుతున్నాడట విజయ్. అందుకే అన్నాదమ్ములు ఇద్దరూ వెబ్ సీరీస్ ప్లాన్ చేస్తున్నారనే టాక్ వస్తోంది. మొత్తానికి తమ్ముడు తమ్ముడు కోసం అన్నయ్య పెద్ద సాహసమే చేస్తున్నాడు.