'రాధేశ్యామ్' లో సర్ప్రైజ్ రోల్ లో కన్పించనున్న యాక్షన్ హీరో .....??

GVK Writings
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా రాధేశ్యామ్. కొన్నేళ్ల క్రితం యూరోప్ లో జరిగిన రెట్రో ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమాని యువ దర్శకుడు రాధాకృష్ణ తీస్తుండగా పూజా హెగ్డే ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. యువి క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో కృషంరాజు, ప్రియదర్శి, భాగ్యశ్రీ, షాషా ఛత్రి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఎంతో భారీ ఖర్చుతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి.  
ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకాభిమానుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇక ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ఒక వార్త పలు మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది. అదేమిటంటే, ఈ సినిమాలోని ఒక ప్రత్యేక పాత్రలో యాక్షన్ హీరో గోపీచంద్ కొన్ని క్షణాలపాటు కనపడనునట్లు చెప్తున్నారు. సినిమాలోని ఒక కీలక సందర్భంలో వచ్చే ఆ రోల్ కు గోపీచంద్ అయితేనే కరెక్ట్ అని భావించిన దర్శకనిర్మాతలు ఇటీవల ఆయనను సంప్రదించగా ఆ పాత్ర చేయడానికి గోపి కూడా ఒప్పుకున్నారని, అతి త్వరలో సినిమా తదుపరి షెడ్యూల్ ప్రారంభం అవ్వగానే ఆయన పాత్ర షూట్ పూర్తి చేయనున్నారని అంటున్నారు.  
దర్శకుడు రాధాకృష్ణ మొదటి సినిమా జిల్ మూవీలో హీరో గోపీచంద్ తో మంచి సాన్నిహిత్యం ఏర్పడడంతోపాటు, రెబల్ స్టార్ ప్రభాస్ కు తనకు మధ్య మంచి స్నేహబంధం ఉండడంతోనే ఈ పాత్ర చేయడానికి గోపి ఒప్పుకున్నారని సమాచారం. మరి ప్రస్తుతం విస్తృతంగా ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే .....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: