ఆది పురుషుడు ప్రభాస్ పక్కన.. సీత పాత్ర ఎవరిదో..?
దర్శకుడు ఓం రౌత్.. రాముడిని ఈజీగా సెలెక్ట్ చేసేశాడు గానీ.. సీత పాత్రకు ఎవరిని సెలెక్ట్ చేయాలో అంతు చిక్కడం లేదు. చక్కని రూప లావణ్యాలు.. భావాలు పలికించే ప్రతిభ ఉండాలి. ఈ క్రమంలో కీర్తి సురేష్ పేరు వినిపించింది. ఆది పురుష్ ను ప్రకటించి వారం కాకుండానే... సీతగా మలయాళీ కుట్టి మారిపోయి బాలీవుడ్ హీరోయిన్ తెరపైకి వచ్చింది.
ప్రభాస్ రాముడైతే.. సీత ఎవరన్న ప్రశ్నకు సమాధానం దొరక్కపోయినా.. కియారా పేరు బయటికొచ్చింది. ఆదిపురుష్‌ను నిర్మిస్తున్న టీ సిరీస్ తీసిన 'అర్జున్‌రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్‌లో కియారా నటించింది. దీంతో.. నిర్మాతలు కియారా అయితే ఎలా ఉంటుందన్న ఆలోచనను వ్యక్తం చేశారట. కీర్తి సురేష్ దక్షిణాదికి తెలిసినా.. హిందీతో క్రేజ్ లేదు. అదే కియారా అయితే.. తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. హిందీ బిజినెస్‌కు కియారా క్రేజ్ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
ఆదిపురుష్‌లో విలన్‌గా.. రావణుడిగా ఎవరు నటిస్తారన్న ఆసక్తి నెలకొంది. ఇప్పటికే సైఫ్ అలీఖాన్ పేరు నడుస్తోంది. దర్శకుడు లాస్ట్ మూవీ తానాజీలో సైఫ్ ప్రతినాయకుడిగా నటించాడు. దీంతో.. సైఫ్‌కు మరో అవకాశాలు ఇస్తాడంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. రాముడు ఓకె అయినా.. రావణ్ ఎవరు? సీతగా ఎవరు బాగుంటారు. ఇలా మెయిన్ రోల్స్ సెలెక్ట్ పనిలో తలమునకలైపోయింది చిత్ర యూనిట్.
ఆదిపురుష్ పై అంచనాలు పీక్ స్టేజ్ లో ఉన్నాయి. అదీ యంగ్ రెబల్ స్టార్ రాముడి పాత్ర వేస్తుండటంతో ఆయన అభిమానుల్లో ఎపుడూ లేని ఆసక్తి నెలకొంది. రాముడి గెటప్ లో ప్రభాస్ ఎలా ఉండనున్నాడు.. నీలి రంగులో కనిపిస్తాడా లేక.. సాధారణంగా కనిపిస్తాడా అనే ఉత్కంఠ సగటు ప్రేక్షకునిలో ఉంది. మరి ఆ ఆదర్శపురుడు పక్కన సీత గెటప్ కు ఎవరిని తీసుకుంటారనే ఆలోచన అందరిలో మెదులుతుంది.