క్యాస్టింగ్ కౌచ్ పై అనుష్క షాకింగ్ కామెంట్స్!

Purushottham Vinay
పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ మూవీతో హీరోయిన్ గా మారిన అనుష్క అంచలంచెలుగా ఎదిగి స్టార్ హీరోయిన్ హోదా తెచ్చుకుంది. నాగార్జున, రవితేజ, మహేష్ బాబు, ప్రభాస్, గోపి చంద్, అల్లు అర్జున్, మంచు విష్ణు,సుమంత్, జగపతి బాబు,  బాల కృష్ణ ఇలా టాలీవుడ్ పెద్ద హీరోలు, చిన్న హీరోలతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది అనుష్క.

ఇటు తెలుగుతో పాటు అటు తమిళంలో కూడా రజినీకాంత్, సూర్య, అజిత్, కార్తీ, ఆర్య వంటి స్టార్స్ తో జత కట్టి అక్కడ కూడా బాగా పాపులర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.

అరుంధతి మూవీ తో లేడీ ఓరియెంటెడ్ సినిమా తీసి స్టార్ హీరోలకి సైతం పోటీ ఇచ్చింది అనుష్క. టాలీవుడ్ నంబర్ వన్ హీరోయిన్ గా ఉన్న అనుష్కకు మంచి పేరుంది. ఆమెను వివాదరహితురాలిగా, మంచి స్వభావం కలిగిన అమ్మాయిగా చెప్పుకుంటారు. పరిశ్రమలో అందరిచేత గౌరవించబడే అనుష్కకు కెరీర్ బిగినింగ్ లో వేధింపులు తప్పలేదట. తనకు కూడా అలాంటి అనుభవాలు ఎదురయ్యాయని అనుష్క క్యాస్టింగ్ కౌచ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొదట్లో అనుష్కను అవకాశాలు కోసం కొందరు దర్శక నిర్మాతలు కమిట్మెంట్ అడిగారట. సినిమా అవకాశం కావాలంటే పడక గదికి రావాలని కోరారట.

ముక్కుసూటిగా ఉండే అనుష్క అలాంటి వారికి దూరంగా ఉంటూ వేధింపుల నుండి తప్పించుకుందట. ఈ విషయాలన్నీ తాజా ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకొచ్చారు. ఇక పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందన్నది అందరూ ఒప్పుకోవాల్సిన నిజం. కొందరు దీనికి బలైపోతున్నారని అనుష్క అన్నారు.

ఇండియన్ బ్లాక్ బస్టర్ బాహుబలిలో ఆమె హీరోయిన్ గా చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అనుష్క మాధవన్ తో కలిసి నటించిన నిశ్శబ్దం మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. థియేటర్స్ బంధ్ నేపథ్యంలో విడుదల వాయిదాపడింది. హారర్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ గా రానున్న ఈ చిత్రంలో అనుష్క మూగదైన పెయింటింగ్ ఆర్టిస్టుగా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: