పవన్ తో కష్టం అంటున్న డైరెక్టర్ క్రిష్....?
అటు పవన్ పర్ఫామెన్స్ కి ఎనలేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది... ఇటు క్రిష్ డైరెక్షన్ కు మంచి డిమాండ్ ఉంది. ఇలా వీరిద్దరి కలయికలో తెరకెక్కనున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే పెట్టుకున్నారు అభిమానులు... ఇప్పటికే ఈ చిత్రానికి "విరూపాక్ష" అని టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను తెలుగు, హిందీ రెండు భాషల్లోనూ విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమా మొగలుల కాలం నాటి కథతో రాబిన్ హుడ్ తరహా పాత్ర చేయనున్నారు పవన్.
అయితే వచ్చే నెల సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఏదైనా అప్ డేట్ దొరుకుతుందా.! లేదా..! అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్...పవన్ పుట్టినరోజు దగ్గర పడుతున్నా... అటు పవన్ నుంచి గానీ, ఇటు క్రిష్ నుంచి గానీ విరూపాక్ష సినిమా గురించి ఎటువంటి లేటెస్ట్ న్యూస్ రాకపోవడంతో ఇప్పట్లో వీరి సినిమా పట్టాలెక్కేలా కనిపించడం లేదని పవర్ స్టార్ ఫ్యాన్స్ నిరాశ పడుతున్నారు. నిజానికి ఇప్పటికే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాల్సి ఉండగా కరోనా కారణంగా షూటింగ్ కు బ్రేక్ పడింది.
సో పవన్ డేట్స్ దొరకడానికి ఇంకా లేట్ అయ్యే అవకాశం ఉన్నందున... సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ తో ఓ సినిమా తీయడానికి రెడీ అయిపోయారు క్రిష్. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా చేయనున్నారు. అయితే ఈ చిత్రాన్ని కేవలం మూడు నెలల్లోగా కంప్లీట్ చేసి వెనువెంటనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో విరూపాక్ష సినిమాను మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారట క్రిష్.