న్యూడ్ గా నటించడానికి ఎటువంటి అభ్యంతరం లేదు .... కానీ .... ??
ఇక ఈ విషయం అంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, టాలీవుడ్ సినిమా పరిశ్రమకి రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన రక్త చరిత్ర అనే సినిమా ద్వారా నటిగా పరిచయమైన రాధిక ఆప్టే, ఆ తరువాత బాలయ్య బోయపాటి ల కాంబోలో వచ్చిన సూపర్ హిట్ మూవీ లెజెండ్ తో పాటు మరొక్కసారి బాలయ్య తోనే లయన్ అనే సినిమాలో నటించి హీరోయిన్ గా టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి పేరుని దక్కించుకుంది. ఇక మొదటి నుండి ఏ విషయంలో అయినా కొంత ముక్కుసూటిగా వ్యవహరించే అలవాటున్న రాధికా తన గురించి కానీ, తన కెరీర్ గురించి కానీ ఎవరు ఏమన్నా ఏ మాత్రం ఊరుకోరు సరికదా వారికి గట్టిగా జవాబిస్తుంటారు. ఇక తెలుగుతో పాటు అటు బాలీవుడ్ లో కూడా మంచి ఆఫర్లతో దూసుకెళ్తున్న రాధికా, ఇటీవల పార్చ్డ్, బద్లాపూర్ వంటి సినిమాల్లో పలు శృంగార సన్నివేశాలతో పాటు మధ్యలో కొన్ని అర్ధ నగ్నంగా ఉన్న సీన్లలో ఏ మాత్రం బెరుకు లేకుండా నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
అయితే తనకు నచ్చిన విధంగా తాను సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నానని, తన పరిస్థితులు తాను చేస్తున్న బోల్డ్ కంటెంట్ మూవీలను చూసి కొందరు నిర్మాతలు తన వద్దకు వచ్చి అటువంటి శృంగార సన్నివేశాలున్న సినిమాలనే చేయాలని కోరుతున్నారని ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో భాగంగా మాట్లాడుతూ చెప్పుకొచ్చింది. కథ డిమాండ్ చేస్తే తాను పూర్తిగా న్యూడ్ గా నటించడానికి కూడా సిద్ధం అని, కానీ కావాలనే శృంగార సన్నివేశాలతో కూడిన సినిమాలు చేయాలని భావించి తన వద్దకు వచ్చిన ఎందరో నిర్మాతలకు తాను నో చెప్పానని అన్నారు రాధికా. అటువంటి రొల్స్ లో మంచి ఫీల్ ఉంటే తప్పకుండా ఛాలెంజింగ్ గా తీసుకుని తాను నటిస్తానని, అలానే తనకు మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ సినిమాలు చేయాలని ఉందని అంటోంది రాధికా ఆప్టే ....!!