నా బర్త్ డే.. నాకే ఎబ్బెట్టుగా అనిపించింది.. నేను మనిషినే.. : పవన్ కళ్యాణ్
జనసేన పార్టీని స్థాపించి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ రాజకీయ నాయకుడిగా నిలబడుతున్నారు పవన్ కళ్యాణ్. అయితే నేడు పవన్ కళ్యాణ్ తన పుట్టినరోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. జనసేన కార్యకర్తలు పవర్ స్టార్ అభిమానులు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే కొన్ని రోజుల ముందు నుంచి అభిమానులు ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక ఈ రోజు బర్త్ డే సందర్భంగా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.
అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం ప్రతిసారి బర్త్ డే కి.. కేక్ కటింగ్ కి దూరంగా ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే బర్త్ డే వేడుకలకు ఎందుకు దూరంగా ఉంటారు అన్న విషయం పై తాజాగా పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు చిన్నప్పటి నుంచి బర్త్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి ఇష్టముండదని... కానీ ఓసారి దర్శకులు నిర్మాతలు కలిసి తన బర్త్ డే సెలబ్రేట్ చేశారని.. అయితే కేక్ కట్ చేయడం దాన్ని నోట్లో పెట్టడం అంత ఎబ్బెట్టుగా అనిపించింది అంటూ చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. తానొక సాధారణ మనిషినేనని... ఇంతమంది ప్రజల అభిమానం దొరకడం దేవుడిచ్చిన అదృష్టం అంటూ చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్.