ఇస్మార్ట్ బ్యూటీకి మెగా హీరో షాక్..!

shami
సుధీర్ బాబు నన్ను దోచుకుందువటే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన నభా నటేష్ పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ సినిమాలో అమ్మడు తన అందంతో ఆడియెన్స్ ను అలరించింది. ఆ తర్వాత రవితేజతో డిస్కో రాజా సినిమా చేయగా ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. ప్రస్తుతం సాయి ధరం తేజ్ తో సోలో బ్రతుకే సో బెటర్.. బెల్లంకొండ శ్రీనివాస్ తో అల్లుడు అదుర్స్ సినిమా చేస్తుంది నభా నటేష్. సోలో బ్రతుకే సో బెటర్ సినిమా టైంలో అమ్మడికి క్రేజీ ఆఫర్స్ రెండు వచ్చినా లైట్ తీసుకుందట.  

తీరా చూస్తే సాయి ధరం తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను ఓటిటి రిలీజ్ చేస్తున్నారు. ఇస్మార్ట్ బ్యూటీకి ఈ సినిమా ఓటిటి రిలీజ్ అవడంతో ఆ ఎఫెక్ట్ కెరియర్ మీద పడుతుందేమో అన్న డౌట్ మొదలైంది. మెగా హీరో సినిమా కదా అని సోలో బ్రతుకే సో బెటర్ సినిమా చేస్తే ఈ సినిమా ఓటిటి రిలీజ్ అవడంతో ఆమె అసంతృప్తిగా ఉంది. అయితే సినిమాలో కంటెంట్.. తనలో టాలెంట్ ఉండాలే కాని ఫ్లాట్ ఫాం ఏదైనా సరే నెగ్గుకు రావొచ్చు.

సినిమాలతో పాటుగా హాట్ ఫోటో షూట్ తో అలరిస్తున్న ఈ అమ్మడు మరో రెండు సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయని తెలుస్తుంది. స్టార్ సినిమాలకు మొదట ప్రిఫరెన్స్ ఇస్తున్న అమ్మడు ఇక మీదట మినిమం బడ్జెట్ సినిమాలు చేయకూడదని భావిస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు కరోనా లాక్ డౌన్ తర్వాత అమ్మడు రెమ్యునరేషన్ కూడా పెంచిందని అంటున్నారు. ఇస్మార్ట్ లాంటి మరో హిట్టు పడితే మాత్రం నభా నటేష్ మళ్ళేఎ దుమ్ముదులిపేయడం ఖాయమని చెప్పొచ్చు.                     

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: