ఇంద్రగంటి వ్యక్తిత్వం పై సుధీర్ బాబు కామెంట్స్ !
ఇప్పుడు ధియేటర్లు మూత పడటంతో ఆ హడావిడి ఎక్కడా లేదు. 6 నెలలు తరువాత ఒక పెద్ద సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో విడుదల అవుతోంది. కలక్షన్స్ రికార్డుల సమస్యలు లేవు కాబట్టి ‘వి’ సినిమాను నెమ్మదిగా ప్రమోట్ చేస్తూ అమెజాన్ సంస్థ తన సభ్యత్వాల సంఖ్య రోజురోజుకు పెంచుకోవడానికి భారీ వ్యూహాలు అనుసరిస్తోంది.
ఇలాంటి పరిస్థితులలో ఎల్లుండి విడుదల కాబోతున్న ‘వి’ మూవీని ప్రమోట్ చేస్తూ సుధీర్ బాబు కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. ఈమూవీ దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణతో పనిచేయడం వల్ల ఒకనటుడు నటుడుగానే కాకుండా వ్యక్తిగా ఎదుగుతాడని దీనితో ఆ నటుడులో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అంటూ కామెంట్స్ చేసాడు. అంతేకాదు షూటింగ్ స్పాట్ లో ఒక కుటుంబ వాతావరణాన్ని ఇంద్రగంటి క్రియేట్ చేస్తూ షూటింగ్ అంతా ప్రశాంతంగా జరగడానికి బాగా సహకరించే నేపధ్యంలో ఇంద్రగంటి తో సినిమాలు చేయడం చాల సులువు అని కామెంట్స్ చేసాడు.
వాస్తవానికి ‘వి’ మూవీ ఓటీటీ లో విడుదల అవ్వడం వల్ల జనం ఎక్కువమంది ఎక్కువసార్లు చూసే ఆస్కారం ఉందని సుమారు రెండు వందల దేశాలలోని తెలుగువారు ‘వి’ మూవీని ఈ వీకెండ్ లో చూడబోతున్నారు అంటూ తన ఉద్దేశ్యంలో ధియేటర్లలో కంటే ఒక సినిమా ఓటీటీ ద్వారా ఎక్కువమందికి కనెక్ట్ అవుతుంది అన్న అభిప్రాయంలో సుధీర్ బాబు ఉన్నాడు. అంతేకాదు ‘వి’ సినిమా ఓటీటీ లో విడుదల అవుతున్న పరిస్థితులలో ఈమూవీలో కొన్ని మార్పులు చేసిన విషయాన్ని వివరిస్తూ ఆ మార్పులు బుల్లితెర పై చూడమని సుధీర్ బాబు కామెంట్స్..