బుల్లితెర మీద ఉమామహేశ్వర ఉగ్రరూపం చూపిస్తాడా..!
సూపర్ హిట్ అవడంతో ఈ సినిమా శాటిలైట్ హక్కులు ఈటివి సొంతం చేసుకుంది. సాధారణంగా ఈమధ్య ఈటివి శాటిలైట్ రైట్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టట్లేదు. స్టార్ హీరోల సినిమాలైతే అసలు పోటీ పడట్లేదు. కాని ఉమామహేశ్వర సినిమాను కావాలని ఈటివి రెండున్నర కోట్లతో శాటిలైట్ డీల్ ఏర్పరచుకున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా వరల్డ్ ప్రీమియర్ ఈ నెల 13 సాయంత్రం 6 గంటలకు ఫిక్స్ చేశారు. ఈటివిలో ఉమామహేశ్వర సినిమా వచ్చే ఆదివారం కాకుండా పైన వచ్చే ఆదివారం రాబోతుందన్నమాట.
మరి ఓటిటిలో రిలీజై సూపర్ హిట్ అందుకున్న ఈ సినిమా బుల్లితెర మీద ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి. ఈ సినిమా తప్పకుండా స్మాల్ స్క్రీన్ ఆడియెన్స్ ను అలరిస్తుందని అంటున్నారు. ఓటిటిలో ఎలాగు హిట్టైన విషయం తెలుసు కాబట్టి ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమా తప్పకుండా తెలుగు బుల్లితెర ఆడియెన్స్ మనసు గెలుస్తుందని అంటున్నారు. మరి ఈటివిలో టెలికాస్ట్ అవుతున్న ఉమామహేశర ఎలాంటి రేటింగ్స్ తెచ్చుకుంటుందో చూడాలి.