షెర్లీన్‌ చోప్రా నగ్న సత్యాలు !

Seetha Sailaja
హాట్ బ్యూటి షెర్లీన్‌ చోప్రా చెప్పిన నగ్న సత్యాలు మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి. న్యూడిటీ అనేది తప్పు కాదని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది ఈ ముద్దు గుమ్మ. తాను ప్లేబాయ్‌ పత్రిక కోసం నగ్నంగా కనిపించడాన్ని, కామసూత్రలో నగ్నంగా నటించడాన్ని కొందరు తప్పుగా చూస్తున్నారని... కానీ న్యూడిటీ కూడా ఒక ఆర్టేనని, అందుకే చాలా మంది ఆర్టిస్టులు నగ్న చిత్రాలు గీస్తుంటారని, అందులో ఎలాంటి అశ్లీలం లేదని వింత వ్యాఖ్యలు చేసింది షెర్లీన్‌. అంతేకాదు తనకి సిగ్గు లేదని, నగ్నంగా కనిపించడాన్ని అవమానంగానో, చిన్నతనంగానో, చీప్‌గానో చూడనని అందుకే ధైర్యంగా నగ్నంగా నటించగలిగా అని షెర్లీన్‌ చెప్పింది. హాలీవుడ్‌లో ప్రముఖ హీరోయిన్లు అందరూ ఏదో ఒక సందర్భంలో నగ్నంగా కనిపించిన వారేననీ అంత మాత్రాన వారు యాక్టర్స్ కారు అంటే ఎలా అని ఎదురు ప్రశ్నలు వేస్తోంది షెర్లీన్‌. తనకి అవకాశాలు రాకపోవడం వల్లే పబ్లిసిటీ కోసం నగ్నత్వాన్ని నమ్ముకుందనే విమర్శలకు భయపడనని ఆమె చెపుతున్న మాటలు విని బాలీవుడ్ మీడియాకు మైండ్ బ్లాంక్ అయింది అని అంటున్నారు. త్వరలో విడుదల కాబోతున్న ‘కామసూత్ర’ 3డి విజయవంతం అయితే తన కళను గుర్తించి ప్రభుత్వ అవార్డులు ఇవ్వాలని షెర్లీన్‌ చోప్రా డిమాండ్ చేసినా ఆశ్చర్యం లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: