నెపోటిజం పై స్పందించిన నాని.. మహేష్, ఎన్టీఆర్ లపై కామెంట్..?

praveen
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో నెపోటిజం  అనే అంశంపై ఎన్నో రోజుల నుంచి చర్చ జరుగుతూనే ఉన్న విషయం  తెలిసిందే . ఎంతో మంది సినీనటులు  నెపోటిజం  పై స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అయితే తాజాగా టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని నెపోటిజం పై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూకి  హాజరైన నాచురల్ స్టార్ నాని.. టాలీవుడ్ లో ఉన్న నెపోటిజం  ఉందా లేదా అని ఎదురైన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం వ్యాఖ్యలు చేసారు. ఈ సందర్భంగా టాలీవుడ్ స్టార్ హీరోలైన మహేష్ బాబు ఎన్టీఆర్ ల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు మహేష్ బాబు.



 తనకు  బాలీవుడ్ లో  నెపోటిజం  ఉందా లేదా అన్న విషయం తెలియదు కానీ మన టాలీవుడ్ విషయానికి వస్తే మాత్రం అలాంటివి పెద్దగా లేవు అని తెలిపాడు. తన కెరీర్ బిగినింగ్ నుంచి అంతా తనకు సహకారం అందించి ప్రోత్సహించారని తెలిపిన నాని..  ఎక్కడైనా ఫంక్షన్స్ లో కలిసినప్పుడు కూడా తనను పలకరించిన విధానం  కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది అంటూ నాని చెప్పుకొచ్చాడు. టాలీవుడ్ లో ఉన్న బిగ్గెస్ట్ స్టార్స్ అందరూ ఎప్పుడు కొత్త టాలెంట్ ని సపోర్ట్ చేస్తూనే ఉంటారు అంటూ చెప్పుకొచ్చారు నాని.




 ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ కిడ్స్ అంటూ పేరొందిన మహేష్ బాబు,  జూనియర్ ఎన్టీఆర్, రానా లాంటి వారు సైతం తనని ఎంతో ప్రేమగా పలకరించే వారిని... తన సినిమా పై వారి అభిప్రాయాలను కూడా తనతో పంచుకునేవారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే స్టార్ కిడ్స్ కి ఒక్క అడ్వాంటేజ్ ఉంటుందని... బ్యాక్గ్రౌండ్ కారణంగా వారికి ఒక్క సినిమాతో వచ్చే క్రేజ్... కొత్త వాళ్లకి నాలుగైదు సినిమాల తో వస్తుంది అంటూ చెప్పుకొచ్చారు నాని. స్టార్ కిడ్స్ అయినప్పటికీ వారు ఎలాంటి ఆధిపత్యం చూపించకుండా సినిమా కోసం ఎంతగానో కష్టపడుతున్నారని..  అయినా వారిని స్టార్ కిడ్స్ అని అంటుంటారు అని చెప్పుకొచ్చారు నాని.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: