మారుతున్న సమీకరణాలు అంతర్మధనంలో టాప్ హీరోలు !

Seetha Sailaja
కరోనా పరిస్థితులు సామాన్యుడుకి మాత్రమే కాదు సెలెబ్రెటీలకు కూడ విపరీతమైన టెన్షన్ ను క్రియేట్ చేస్తూ వారి భవిష్యత్ కు సంబంధించి కూడ అయోమయాన్ని క్రియేట్ చేస్తోంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. గత 5 సంవత్సరాలుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పరిధి విపరీతంగా పెరగడంతో సినిమాలకు వచ్చే కలక్షన్స్ రేంజ్ పెరగడంతో హీరోల పారితోషికాలు కూడ విపరీతంగా పెరిగిపోయాయి.


ముఖ్యంగా టాప్ హీరోల పారితోషికాలు రెట్టింపు స్థాయికి చేరిపోవడంతో సినిమా నిర్మాణ వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. దీనికితోడు మన హీరోలు తెలుగు ప్రేక్షకులకే పరిమితమవకుండా ఇతర భాషల్లోనూ తమ సినిమాలను విడుదల చేస్తూ తమ మార్కెట్ పెంచుకోవడానికి గత కొన్ని సంవత్సరాలుగా చాల గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికితోడు కరోనా పరిస్థితులు ప్రారంభం కానంత వరకు టాప్ హీరోల సినిమాలకు ఓవర్ సీస్ లో వచ్చే కలక్షన్స్ బోనస్ గా మారాయి.


అంతేకాదు హీరోలు సినిమా బడ్జెట్ ని బట్టి పారితోషకం తీసుకోవడంతో పాటు సినిమాకి వచ్చే లాభాల్లో వాటాలు కొన్ని ఏరియాల రైట్స్ తీసుకోవడం అలవాటుగా మార్చుకున్నారు. గతంలో చిరంజీవి ఈ పద్ధతిని అనుసరించినా ఇప్పుడు టాప్ యంగ్ హీరోలు ఈ పద్ధతికి మరింత స్పీడ్ పెంచి నిర్మాతలకు చుక్కలు చూపెట్టే స్థాయికి ఎదిగిపోయారు.


నేషనల్ సెలెబ్రెటీ స్థాయికి చేరిపోయిన ప్రభాస్ నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కు అదేవిధంగా ‘ఆదిపురుష్’ మూవీకి 80 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు లీకులు వస్తున్నాయి. ముఖ్యంగా ‘ఆదిపురుష్’ కు సంబంధించి ప్రభాస్ పారితోషికంతో పాటు ఈమూవీ తెలుగు రైట్స్ ను కూడా తీసుకుంటున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇక మహేష్ అల్లు అర్జున్ లు కూడ తమ లేటెస్ట్ మూవీలు ‘సర్కారువారి పాట’ ‘పుష్ప’ మూవీలకు సంబంధించి 40 కోట్ల వరకు పారితోషికాలు తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం నాలుగు ప్రాజెక్ట్స్ ని లైన్లో పెట్టిన పవన్ కళ్యాణ్ ఒక్కో సినిమాకి 50 నుంచి 55 కోట్ల వరకు తీసుకున్నాడట. జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు సైతం 30 నుండి 35 కోట్ల వరకు తీసుకుంటున్నారని ఇండస్ట్రీ టాక్. అయితే ప్రస్తుత పరిస్థితులలో ధియేటర్లు ఓపెన్ అయినా కలక్షన్స్ రావు అని వస్తున్న అంచనాలు నిజం అయితే ఈ టాప్ హీరోల అందరి భారీ పారితోషికాల పై భారీ కోత పడుతుంది. ఈ పరిస్థితుల నుండి ఎలా తప్పించుకోవాలి అన్న అంతర్మధనంలో ప్రస్తుతం టాప్ హీరోలు అంతా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: