రేప్ సీన్ లో గాయపడ్డ హీరోయిన్ !

Seetha Sailaja
సినిమాలలో రేప్ సీన్స్ కనపడగానే ఎక్కడ కోత పెట్టాలా అని సెన్సార్ వారు కత్తెర పెట్టుకుని నిల్చుంటారు. కానీ ఒక వర్గం ప్రేక్షకులు మాత్రం ఇటువంటి సన్నివేసాలు ఎప్పుడు వస్తాయా అనే ఎదురు చూస్తూ ఉంటారు. సినిమా కథ, సందర్బాన్ని బట్టి సినిమాల్లో రేప్ సీన్లు ఉండటం ఏనాటి నుంచో సర్వ సాధారణం అయి పోయింది. అయితే ఆ సీన్లు చేయడం అంత సులువేమీ కాదు అన్న విషయం ఆసన్ని వేసాలలో నటించే నటనటులకే తెలుస్తుంది. ఆ రేప్ సీన్ రియల్ సీన్‌లా పండేందుకు నటీనటులు పడే కష్టం అంతా ఇంతా కాదు అనే విషయం సినిమా షూటింగ్ ప్రత్యక్షంగా చూసే వారికి మాత్రమే తెలుస్తుంది. ముఖ్యంగా ఆ సీన్లో నటించే నటీనటుల మధ్య కో ఆర్డినేషన్ ఏమాత్రం తప్పినా ఆసీన్ లో నటించే వారికి నరకం కనిపిస్తుంది. బాలీవుడ్ బ్యూటీ రైమా సేన్ కు ఇలాంటిఅనుభమే ఎదురైంది అనే ఆమె బహిరంగంగా చెప్పింది. ఆ సీన్ చేస్తుండగా ఆమెకు స్వల్పంగా గాయాలు అయ్యాయి అట. అయినా సరే ఓర్చుకుంటూ సీన్ పండేందుకు తన వంతు సహాయం అందించానంటోంది ఈ బ్యూటీ. ఈమెకు ఎదురైన అనుభవాన్నిమీడియాతో పంచుకుంది. ఆ సీన్ చేస్తుండగా చాలా ఇబ్బంది పడ్డాననీ ఇలాంటి సీన్లు చేయ వలిసే వస్తుందని తాను ఎప్పుడు అనుకోలేదని మీడియాకు వివరించింది. అంతేకాదు ఈసీన్ చేస్తున్నప్పుడు తన శరీరానికి ఏమైనా అవుతుందేమోనని భయపడ్డాను అని రైమా సేన్ చెప్పుకొచ్చింది. ‘చిల్డ్రన్ ఆఫ్ వార్' అనే సినిమాలో రైమా సేన్ కు ఈ అనుభవం ఎదురు అయ్యింది. పాకిస్తాన్ సైనికులు బంగ్లాదేశ్ మహిళలపై జరిపిన దురాగతాల గురించి వాస్తవంగా తీసిన సినిమా ఇది. ఈ సినిమా బాలీవుడ్ లో ఈ వారం విడుదల కాబోతోంది. రైమా సేన్ పడ్డ కష్టాన్ని బాలీవుడ్ ప్రేక్షకులు గుర్తిస్తారో లేదో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: