సంవత్సరానికి ఒక ప్రభాస్ సినిమా విడుదల అవుతుందా? లేదా?

Purushottham Vinay
"రెబల్ స్టార్ ప్రభాస్"... "బాహుబలి" కి ముందు ఒక లెక్క బాహుబలి తరువాత ఒక లెక్క.. ఇప్పుడు అతనో నేషనల్ స్టార్.. దేశం నలుమూలల తన పేరుని విస్తరించుకున్నాడు. ఇప్పుడు దేశం అంతటా అభిమానులను సంపాదించుకున్నాడు. బాహుబలి కోసం 3 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఆ కష్టానికి తగ్గ ఫలితం ఇప్పుడు సొంతం చేసుకున్నాడు. ఎంతలా అంటే ప్రభాస్ సినిమా ప్లాప్ అయినా కానీ తన క్రేజ్ పెరుగుతుందే తప్ప తగ్గదు అనేలా ఎదిగాడు. ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా మూవీలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. లాస్ట్ ఇయర్ దాకా ఫ్యాన్స్ కి ఎలాంటి అప్డేట్ ఇవ్వని ప్రభాస్. ఈ ఇయర్ లో తన సినిమాల గురించి వరుస అప్డేట్ లు ఇస్తూ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నాడు.

ఒక సినిమా కంప్లీట్ చేసిన తరవాత మరో సినిమా స్టార్ట్ చేయడం ప్రభాస్‌కి అలవాటు. ‘సాహో’ టైమ్‌లో దాన్ని బ్రేక్ చెయ్యాలని చూశాడు. కానీ, కుదరలేదు. ‘సాహో’తో పాటు ‘రాధే శ్యామ్’ షూటింగ్ సైమల్‌టేనియస్‌గా స్టార్ట్ చేసినా ప్లాన్ చేసినట్టు షూట్ చెయ్యలేదు. ఇకనుండి అలా జరగకుండా చూసుకోవాలని పర్‌ఫెక్ట్‌గా షెడ్యూళ్ళు ప్లాన్ చేస్తున్నాడట. ఈసారి రెండు పడవల మీద ప్రయాణం చేసి, 2022లో రెండు సినిమాలు రిలీజ్ చెయ్యాలని భావిస్తున్నాడట.

ప్రజెంట్ ప్రభాస్ ముందు మూడు సినిమాలు ఉన్నాయి. ‘రాధే శ్యామ్’ షూటింగ్ కొంత చేశాడు. ముందు దాన్ని కంప్లీట్ చెయ్యాలి. తరవాత నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ఫ్యూచరిస్టిక్ సైంటిఫిక్ థ్రిల్లర్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్‌తో రామాయణం ఆధారంగా మైథలాజికల్ సోషియో ఫాంటసీ ‘ఆది పురుష్’ కంప్లీట్ చెయ్యాలి. కరోనా కథాకమామీషు ముగిసిన తరవాత బ్రేక్ తీసుకోకుండా వన్ బై వన్ కంటిన్యూగా షూటింగ్ చెయ్యాలని అనుకుంటున్నాడట.
 
‘ఆది పురుష్’ టీమ్ నుండి వన్ బై వన్ అప్‌డేట్స్ వస్తుండటంతో నాగ్ అశ్విన్ సినిమా లేట్ అవుతుందేమో అని అనుమానాలు వస్తున్నాయి. ‘రాధే శ్యామ్’ కంప్లీట్ చేశాక, ఓం రౌత్ సినిమా స్టార్ట్ చేస్తారట. 2021 జూలై లేదా ఆగస్టు నుండి నాగ్ అశ్విన్ సినిమా షూటింగ్ మొదలు అవుతుందట. నెక్స్ట్ ఇయర్ ‘రాధే శ్యామ్’, ఆ నెక్స్ట్ ఇయర్ ‘ఆది పురుష్’ రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేశారు. నాగ్ అశ్విన్ సినిమా 2022లో రిలీజ్ చేయడం వీలు కాకపోతే 2023కి షిఫ్ట్ అవుతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: