అందుకే బయోపిక్ సినిమాలు ఫ్లాప్ అవుతాయి : సుధీర్ బాబు

praveen
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం అయిన సుధీర్ బాబు తక్కువ కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. కేవలం హీరోగానే కాకుండా విలన్ గా  కూడా తన నటనతో మెప్పించాడు సుధీర్ బాబు.  బాలీవుడ్ లో  సైతం విలన్ గా  నటించి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు. అయితే మొదట్ లో  అడపాదడపా సినిమాలు చేసినప్పటికీ... ఆ తర్వాత మాత్రం కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్న సుధీర్ బాబు... నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలను మాత్రమే ఎంచుకుంటున్నారు.



 ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయి నటిస్తూ ఎన్నో ప్రశంసలు అందుకున్నాడు సుధీర్ బాబు. ఇటీవలే సుధీర్ బాబు నాని హీరోలుగా మల్టీస్టార్ గా తెరకెక్కిన 'వి' సినిమాలో సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. తనదైన బాడీ ఫిట్నెస్ తో... పోలీస్ అంటే ఇలా ఉండాలి అనే విధంగా యాక్షన్ తో అదరగొట్టాడు సుధీర్ బాబు. ఈ సినిమా ఇప్పటికే మంచి టాక్ ను సొంతం చేసుకుంటుండగా..  సుధీర్ బాబు పర్ఫామెన్స్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే తాజాగా సుధీర్ బాబు బయోపిక్ ల గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.



 ఈ మధ్యకాలంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బయోపిక్ సినిమాలు ఫ్లాప్ కావడానికి గల కారణం ఏమిటి అనేది తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు సుధీర్ బాబు. బయోపిక్ లో నటించే నటులు ఆ వ్యక్తి యొక్క ఆత్మ పై దృష్టి పెట్టకపోవడం వల్లే బయోపిక్ లు  ప్రేక్షకులను మెప్పించలేక ఫ్లాప్ అవుతున్నాయన్నారు. కేవలం బాడీ లాంగ్వేజ్ పైన దృష్టి పెట్టి ఆత్మను మిస్ అవ్వడం కారణంగానే బయోపిక్ లు రాణించలేక పోతున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశాడు సుధీర్ బాబు. ఇక ఒక వ్యక్తి సోల్  తెలియాలంటే అతనితో మాట్లాడి కొంతకాలం ప్రయాణం చేయాలి అంటూ తెలిపాడు. ప్రస్తుతం సుధీర్ బాబు పుల్లెల గోపీచంద్ బయోపిక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: