పాపం వంశీ పైడిపల్లి చివరకు ఆ హీరో దగ్గరకు వచ్చాడా..?

shami
సూపర్ స్టార్ మహేష్ తో మహర్షి లాంటి సూపర్ హిట్ అందించినా సరే డైరక్టర్ వంశీ పైడిపల్లికి నెక్స్ట్ సినిమా హీరో దొరకడం లేదు. సరిలేరు నీకెవ్వరు తర్వాత అసలైతే మహేష్ వంశీ పైడిపల్లితోనే చేయాల్సి ఉంది కానీ ఎందుకో ఆ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్ళలేదు. ఇక మహేష్ ఎలాగు హ్యాండ్ ఇచ్చాడని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా ప్లాన్ చేశాడు వంశీ పైడిపల్లి. అయితే ఆర్.ఆర్.ఆర్ నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ లో రిలీజ్ అయ్యేలా ఉందని మరో ఏడాది దాకా వెయిట్ చేయాలని సలహా ఇచ్చాడట.

మహేష్, చరణ్ ఇద్దరు కాదనేసరికి వంశీ పైడిపల్లి అక్కినేని హీరో అఖిల్ తో సినిమా ఫిక్స్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అఖిల్ ప్రస్తుతం బ్యాచ్ లర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత అసలైతే సురేందర్ రెడ్డి సినిమా ఉంటుందని అంటున్నారు. ఆ సినిమాతో పాటుగా వంశీ పైడిపల్లి కూడా అఖిల్ తో సినిమాకు సిద్ధం అవుతున్నాడని తెలుస్తుంది. నాగార్జునతో ఊపిరి సినిమా చేసిన వంశీ పైడిపల్లి మీద అక్కినేని ఫ్యామిలీకి మంచి ఒపీనియన్ ఉంది.

ఎలాంటి కథ అయినా వంశీ బాగా హ్యాండిల్ చేస్తాడన్న నమ్మకం ఉంది. అందుకే అఖిల్ తో వంశీ పైడిపల్లి మూవీకి నాగార్జున కూడా ఎలాంటి అభ్యంతరం పెట్టడని తెలుస్తుంది. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను కెరియర్ లో మూడు సినిమాలు చేసిన అఖిల్ ఇప్పటివరకు కమర్షియల్ సక్సెస్ అందుకోలేదు. బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో వస్తున్న బ్యాచ్ లర్ సినిమా తప్పకుండా అలరించేలా ఉంది. ఆ సినిమా హిట్ అయితే అఖిల్ ట్రాక్ లోకి వచ్చినట్టే అని చెప్పుకోవచ్చు.                            
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: