రజినీకాంత్ ను భయ పెట్టిన సోనాక్షి సెక్యూరిటి !

Seetha Sailaja
బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా ప్రవర్తన ఇప్పుడు మీడియాను ఆశ్చర్య పరుస్తోంది. దీనికి కారణం ఇంతకు ముందెప్పుడూ, ఏ హీరోయిన్‌కీ లేనంత టైట్ సెక్యూరిటీ రక్షణ కవచంలా ఆమెకు నిలవడంతో సోనాక్షి ఒక్కసారిగా బాలీవుడ్ మీడియాకు హాట్ న్యూస్ గా మారింది. ప్రస్తుతం ఈమె సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన 'లింగా' సినిమాలో నటిస్తోంది అన్న విషయం తెలిసిందే. మైసూర్ ప్యాలెస్ పరిసరాల్లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరిగింది. ఈవారంలో రామోజీ ఫిలిం సిటీకి ఈ సినిమా షూటింగ్ షిప్ట్ కానుంది. సాధారణంగానే రజనీకాంత్ సినిమా షూటింగ్ అంటే ఫ్యాన్స్‌కి కన్నుల పండగే. ఇక దానితో బాలీవుడ్ బ్యూటీలు కూడ తోడయితే వచ్చే జనానికి లెక్కే ఉండదు. ఈ సినిమా షూటింగ్ లో సోనాక్షిని చూడడానికి వస్తున్న జనాన్ని అదుపు చేయడానికి 50 మంది పోలీసులు పహారా కాస్తుండగా మరో 30 మంది బౌన్సర్లు ప్రైవేటు రక్షణ సిబ్బంది లొకేషన్‌లో వుండి జనాన్ని కంట్రోల్ చేస్తున్నారట. సోనాక్షిని చూడటం కోసం వస్తున్న జనాన్ని చూసి రజనీ కూడా షాకవుతున్నాడట. గతంలో ఐశ్వర్యతో 'రోబో' షూట్ చేస్తున్నప్పుడు, దీపికా పదుకునెతో 'కొచ్చాడయాన్' షూట్ చేస్తున్నప్పుడూ ఇలాగే రజనీ హీరోయిన్స్ ను చూడడానికి జనం క్యూ కట్టారు. దక్షిణ భారత సినిమా రంగంలో చక్రవర్తిగా ఎదురు లేని స్థానంలో ఉన్న రజినీకాంత్ సినిమాలకు కూడ హీరోయిన్ గ్లామర్ ఎంత ప్రాముఖ్యంగా మారిందో ఈ సఘటన ఋజువు చేస్తోందని విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: