బిగ్ బాస్ సీజన్ 4 మొదటి కెప్టెన్ లాస్య..!

shami
బిగ్ బాస్ సీజన్ 4 మొదటివారం పూర్తయింది. శనివారం హోస్ట్ హంగామా ఓ రేంజ్ లో ఉంటుంది. ఇక ఈ సీజన్ లో మొదటి వీకెండ్ నాగార్జున కూడా ఏదో మమా అనిపించినట్టు అనిపించింది. ఇక హౌజ్ లో కట్టప్ప ఉన్నాడు.. మీలోనే ఉంటూ మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తాడు అంటూ లక్సరీ బడ్జెట్ లో డబ్బులను కట్ చేసిన బిగ్ బాస్ అసలు ఇంట్లో కట్టప్పే లేడని చెప్పడం ఇంటి సభ్యులకే కాదు ఆడియెన్స్ కు షాక్ ఇచ్చింది.

ఇక ఫైనల్ గా నాగార్జున సమక్షంలో కట్టప్పగా అనుమానం ఉన్న ఐదుగురిని నిలబెట్టి అందులో ఒకరిని కట్టప్ప ఎవరని అడిగినా అందరు లాస్య అని చెప్పారు. ఫైనల్ గా ఇంట్లో కట్టప్ప ఎవరు లేరు కనెక్షన్స్ పెంచుకుంటే అవతల వ్యక్తి మీద అసలు డౌట్ వచ్చేది కాదు కాని మీరు కనెక్షన్స్ పెంచుకోకుండా చేయడం వల్ల ఇలా జరిగిందని అన్నాడు. అంతేకాదు లాస్యని కట్టప్పగా అన్నందుకు ఆమెనే ఇంటి కెప్టెన్ ను చేశాడు నాగార్జున.

సో బిగ్ బాస్ సీజన్ 4 హౌజ్ మొదటి కెప్టెన్ లాస్య. ఈ సీజన్ స్టార్ సెలబ్రిటీగా వచ్చిన లాస్య ఈ వారం రోజుల్లో పెద్దగా ఆకట్టుకోలేదు. లాస్య మితభాషిగా ఉండటం చూసి ఆమెనే కట్టప్ప అనుకున్నారు. కాని ఫైనల్ గా కట్టప్ప ఎవరు లేరని తెలిసి షాక్ అయ్యారు. బిగ్ బాస్ సీజన్ 4లో మొదటివారం ఏడుగురు నామినేషన్స్ లో ముగ్గురిని సేవ్ చేసిన నాగార్జున ఎలిమినేట్ అయ్యే ఆ ఒక్కరు ఏరన్నది ఆదివారం వెల్లడిస్తారని తెలుస్తుంది. ఈ వారం నామినేషన్స్ లో ఉన్న వారిలో అభిజిత్, సుజాత, గంగవ్వ సేవ్ అవ్వగా దివి, సూర్య కిరణ్, మెహబూబ్ ఇంకా అఖిల్ నామినేషన్స్ లో ఉన్నారు.                 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: