పాయల్ రాజ్ పుత్ ఈసారి డబుల్ కిక్ ఇస్తుందా..!
అయితే రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ ఈసారి తన పాత్రకు తానే తెలుగు డబ్బింగ్ చెప్పుకుంటుంది. ఇంటర్వ్యూస్ లో కూడా తెలుగు బాగానే మాట్లాడుతున్నట్టు కనిపించిన అమ్మడు మీరు తెలుగులో డబ్బింగ్ చెప్పొచ్చుగా అంటే త్వరలో చెబుతా అని అన్నది. జయత్ సినిమాకు ఆ ఛాన్స్ వాడుకుంటుని పాయల్. తన అందంతో అలరించే అమ్మడు ఇప్పుడు వాయిస్ తో కూడా ఆడియెన్స్ కు డబుల్ కిక్ ఇవ్వనుంది.
ఈ సినిమా ఎప్పుడు మొదలుపెట్టారో ఎప్పుడు షూట్ చేశారో కాని సడెన్ గా షూటింగ్ పూర్తైంది అంటూ షాక్ ఇచ్చారు. సినిమాలో మిగతా స్టార్ కాస్ట్ ఎవరు. పాయల్ ఎవరితో రోమాన్స్ చేస్తుంది అన్న విషయాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం తన సోషల్ బ్లాగ్స్ లో మిషన్ పూర్తయింది.. మొదటిసారి తెలుగులో డబ్బింగ్ చెప్పా అని చెప్పుకొచ్చింది పాయల్. చూస్తుంటే ఇక తన తర్వాత సినిమాల్లో కూడా పాయల్ ఇలానే తన తెలుగు డబ్బింగ్ కొనసాగించేలా ఉంది.
ఈ ఇయర్ మొదట్లో డిస్కో రాజా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పాయల్ ఆ సినిమాతో నిరాశపరచింది. మరి రానున్న సినిమాలతో అయినా అమ్మడు హిట్టు కొడుతుందేమో చూడాలి.