అదిపురుష్ మ్యూజికల్ గేమ్ లో ప్రభాస్ మనసులోని అనుష్క ఎవరు !

Seetha Sailaja
ప్రభాస్ నటించబోతున్న ‘ఆదిపురుష్’ మూవీలో సీత పాత్ర ఎవరు నటిస్తారు అన్న విషయమై అనేక ఊహాగానాలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు సీతగా కీర్తి సురేష్ నటిస్తుంది అని వార్తలు వస్తూ ఉండగా ఎవరు ఊహించని విధంగా ఇప్పుడు సీతగా అనుష్క శర్మ పేరు బయటకు రావడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది.


బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో అనుష్క శర్మకు మంచి నటిగా పేరు ఉన్నప్పటికీ ఆమె సీత పాత్రలో ‘ఆదిపురుష్’ మూవీలో నటించడం జరిగే పనికాదు అంటూ బాలీవుడ్ మీడియా వార్తలు రాస్తోంది దీనికికారణం అనుష్క శర్మ ప్రస్తుతం గర్భవతి. ఆమె తల్లిని కాబోతున్నాను అని చెప్పడమే కాకుండా తనకు వచ్చే ఏడాది జనవరిలో ఒక బిడ్డ పుట్టబోతోంది అంటూ ఓపెన్ గానే చెప్పింది. ఇలాంటి పరిస్థితులలో అనుష్క శర్మ తనకు బిడ్డ పుట్టిన తరువాత తిరిగి కోలుకుని షూటింగ్ లకు రెడీ కావాలి అంటే కనీసం 6 నుంచి 9 నెలల సమయం పడుతుంది.


ఇలాంటి పరిస్థితులలో వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభం అయ్యే ‘ఆదిపురుష్’ లో అనుష్క శర్మ సీత ఎలా అవుతుంది అంటూ జాతీయ మీడియా సందేహాలు వ్యక్త పరుస్తోంది. అంతేకాదు ఈమూవీకి సంబంధించి ప్రభాస్ మనసులో ఉంది అనుష్క శెట్టి అని అనుష్క శర్మ కాదు అంటూ జాతీయ మీడియా ఊహాగానాలు చేస్తోంది. వాస్తవానికి ‘సాహో’ మూవీలో కూడ అనుష్క ను హీరోయిన్ గా అనుకున్నారు.


అయితే ఆమె అప్పట్లో ‘సాహో’ లో నటించడానికి పెద్దగా ఆశక్తి చూపించకపోవడంతో ఆమె స్థానంలో శ్రద్ధా కపూర్ వచ్చి చేరింది. అయితే ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న ‘ఆదిపురుష్’ ఒక ట్రెండ్ సెటింగ్ మూవీ కావడంతో ఆమూవీలో అవకాశం ఇస్తే సీతగా నటిస్తాను అంటూ అనుష్క ఇప్పటికే ప్రభాస్ కు సంకేతాలు పంపిందని అందుకోసమే అనుష్క శర్మ పేరు సీతగా ముందుగా వెలుగులోకి తీసుకు వచ్చి ఆతరువాత ఆమె కాదంటే ఈమూవీలో అసలు సీతగా అనుష్క శెట్టి ఎంటర్ అవుతుంది అంటూ ఒకప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక ఆసక్తికర ఊహాగానాలు ప్రచురించింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: