డ్రగ్స్ కేసులో ట్విస్ట్.. రకుల్ కి సారీ చెప్పిన సమంత..?
ప్రస్తుతం డ్రగ్స్ వ్యవహారంలో రియా చక్రవర్తి ని అధికారులు విచారిస్తున్న నేపథ్యంలో ఈ విచారణలో భాగంగా రియా చక్రవర్తి డ్రగ్స్ కేసులో మరో 25 మంది సినీ ప్రముఖులకు సంబంధాలు ఉన్నట్లు తెలిపి వారి పేర్లను వెల్లడించింది అని గత కొన్ని రోజుల నుంచి మీడియా కోడై కూస్తోంది. ఇక ఈ కేసులో సారా అలీ ఖాన్ తో పాటు రకుల్ ప్రీత్ సింగ్ పేర్లను కూడా రియా చక్రవర్తి వెల్లడించింది అని మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. అయితే ఈ వార్తలపై ఇటీవలే ఏన్సీబీ అధికారులు స్పందించారు. డ్రగ్స్ కేసు విషయమై మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని... ఇప్పటివరకు విచారణలో రియా చక్రవర్తి కేవలం డ్రగ్ స్మగ్లర్ల పేర్లు మాత్రమే చెప్పిందని తెలిపిన ఎన్సీబీ అధికారులు 25 మంది బాలీవుడ్ ప్రముఖులకు డ్రగ్స్ కేసుతో సంబంధం ఉంది అంటూ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని అంటూ క్లారిటీ ఇచ్చారు.
ఇక ఎన్సీబీ అధికారులు ఈ విషయాన్ని బయట పెట్టడం మరో సంచలనం గా మారిపోయింది. అంతేకాకుండా గత కొన్ని రోజుల నుంచి తెరమీద వైరల్ అవుతున్న రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్ లకు కూడా డ్రగ్స్ కేసులో ఎలాంటి సంబంధం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. దీంతో ఎంతో మంది నెటిజన్లు అయితే రకుల్ ప్రీత్ సింగ్ సారా అలీ ఖాన్ లను అనవసరంగా అపార్థం చేసుకున్నామని అనుకుంటూ సోషల్ మీడియా వేదికగా సారీ చెపుతున్నారు. ఈ క్రమంలోనే అందరి తరపున అక్కినేని సమంత రకుల్ ప్రీత్ సింగ్ కి క్షమాపణలు చెప్పారు.