బిగ్ బాస్ 4 : ఎలిమినేట్ అయ్యాక సూర్య కిరణ్ స్పందన చూడండి.
ఇంట్లో ఉన్నవాళ్ల గురించి చెప్పడానికి ఓ గేమ్ పెట్టాడు బిగ్‌బాస్. ఏ జంతువుకు ఎవరికి రిలేటడ్ అని తెలిపే గేమ్ అది. అందులో మోనాల్‌ను నెమలితో పోల్చాడు సూర్యకిరణ్. గంగవ్వను చీమతో పోల్చాడు సూర్యకిరణ్. చిన్న ప్రాణి అయినా మూడు రెట్ల బరువు మోయగల చీమ లాంటిది గంగవ్వ. అంత బాధ, బరువు మోశారు అని పొగిడేశాడు. దేవిని మొసలి అన్నాడు సూర్యకిరణ్. మొసలిలా ఎక్కడైనా బతకగలదు.. ఎంతమంది ఇన్ఫ్లూయెన్స్ చేసినా ఆమె ప్రభావితం కాదు అని వివరించాడు. కొండను కూడా తొలిచి వెళ్లగల సత్తా ఎలుకది.. అందుకే సోహైల్‌ను ఎలుకతో పోల్చాడు. అయతే తనను తాను ఇంకా మెరుగుపరుచుకోవాలని చెప్పాడు. అభిజిత్‌ను గోడ మీద పిల్లితో పోల్చాడు. పిల్లి నుండి పులి అవ్వడానికి మీరు 70 శాతం ప్రయత్నం పూర్తి చేశారు. మరో 30 శాతం కష్టపడితే పులి అయిపోతారు అనిచెప్పాడు.
ఇక దివిని తాబేలుతో పోల్చాడు . నువ్వు ఉల్టా పడితే గానీ ఎవ్వరూ చంపలేరు. అందుకే కన్ఫ్యూజ్ కాకుండా జాగ్రత్తగా ఆడమని చెప్పారు. కళ్యాణిని కోతితో పోల్చాడు. ఒక చెట్టు బాగుందని ఉండే మీరు… మరో చెట్టుకు దూకుతారు. అయితే తనలోని అమాయకత్వం కారణమని చెప్పాడు. షార్ప్ ఐస్ ఉన్న మెహబూబ్‌ను గద్దతో పోల్చాడు సూర్యకిరణ్. ఇక హారికను పాముతో పోల్చాడు. పాములో ఉన్న షార్ప్ నెస్ నీలో ఉంది… దానిని బాగా వాడు అని చెప్పాడు సూర్యకిరణ్. శునకం లాంటి విశ్వాసమైన అమ్మాయి సుజాత అని సూర్యకిరణ్ పొగిడేశాడు. నోయల్‌ను నక్కతో పోల్చిన సూర్యకిరణ్… మంత్రి లాంటి ఆలోచన ఉందని, ఓవర్ థింకింగ్ అని వివరించాడు.
హౌస్‌లో ఉన్న బాధ్యత ఉన్న లాస్యకు గాడిద అని ట్యాగ్ ఇచ్చాడు. అంత బరువు బాధ్యతలు మోయగలగడం లాస్య వల్లనే అని చెప్పాడు. టాస్క్‌ల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించిన ఆరియానాకు గుడ్ల గూబ అని పెట్టాడు. అంత నిశితంగా పని చేస్తుందని చెప్పడం ఆయన ఉద్దేశం. ఇక అఖిల్‌ను దున్నపోతుతో పోల్చాడు. నీతో ఉన్నవాళ్లు నిన్ను ఎలా వాడుతున్నారనేదే ఇక్కడ ముఖ్యం. దానిని మీరే చూసుకోవాలి అని చెప్పాడు. అమ్మ రాజశేఖర్‌ను సింహంతో పోల్చాడు. సింహం అడవికి రాజు. అయితే ఆ రాజు మంచితనాన్ని అందరూ లీనియర్నెస్గా తీసుకోకుండా చూసుకోండి అని చెప్పాడు. ఒక రోజు డ్యూటీ ఫ్రీ అనే బిగ్ బాంబ్‌ను దేవి నాగవల్లి మీద సూర్యకిరణ్ వేశారు. ఆమె ఇంటికి వచ్చిన రోజు నుండి పని చేస్తూనే ఉన్నారు కాబట్టి ఆమె మీద వేయడమే కరెక్ట్ అని చెప్పారాయన. ఆ తర్వాత ఆయన్ని పంపించేశారు.
ఇక ప్రముఖ కమెడియన్ కుమార్ సాయి బిగ్ బాస్ సీజన్ 4 లోకి ఎంట్రీ ఇచ్చాడు. చూడాలి మరి ఇతను ఏ జంతువు అవుతాడో...