మనోళ్లంటే అంత చిన్నచూపా..?
తెలుగులో ఏడాదికి 250కి పైగా సినిమాలు నిర్మాణమవుతుంటాయి. అందులో 150 సినిమాలు మాత్రమే రిలీజ్ అవుతున్నాయి. అంటే ఏడాదికి సుమారుగా 1250 పాటలు రికార్డ్ అవుతున్నాయి. వీటిల్లో 200 పాటలు హిట్ అవుతున్నాయి. అయితే ఈ హిట్స్ లో మాగ్జిమమ్ పరభాష పాటగాళ్లు పాడిన పాటలే ఉంటున్నాయి. అంటే హిట్ సాంగ్స్ ని నాన్ లోకల్స్ కి ఇచ్చి, యావరేజ్ పాటలని ఇక్కడ వాళ్లకి ఇస్తున్నారని చెప్పొచ్చు. అంటే ఇక్కడ కూడా తెలుగు గాయకులకు అన్యాయం జరుగుతోందనే చెప్పాలి.
లోకల్ సింగర్స్ ఎంత బాగా పాడినా సంగీత దర్శకులు మాత్రం అందుకు తగ్గ రెమ్యునరేషన్స్ ఇవ్వడం లేదు. ఒక పెద్ద సినిమాలో లోకల్ స్టార్స్ సునీత, హేమచంద్ర, అనురాగ్ కులకర్ణి లాంటి వాళ్లు హిట్ సాంగ్ పాడితే వాళ్లకి 50 వేలకి మించి ఇవ్వడం లేదట. ఇక చిన్నోళ్లకి అయితే పాట పాడే ఛాన్స్ ఇవ్వడమే గొప్ప అన్నట్లు ఎంతో కొంత చేతిలో పెడుతున్నారట.
తెలుగు నేటివిటీ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా లోకల్ టాలెంట్ ని పెద్దగా ప్రోత్సహించడం లేదనే విమర్శలున్నాయి. ఇప్పటికే తెలుగు హీరోయిన్లకి, సపోర్టింగ్ ఆర్టిస్టులకు సరైన గౌరవం దక్కట్లేదని విమర్శిస్తోంటే మ్యూజిక్ ఇండస్ట్రీ కూడా ఇలాగే బిహేవ్ చేయడం విస్మయపరుస్తోంది. మొత్తానికి సంగీత ప్రపంచం లోకల్ సింగర్స్ ని తక్కువగా చూస్తోందనే వాదన వినిపిస్తోంది. ప్రతిభ కంటే పరభాషకే ఎక్కువగా ప్రియారిటీ ఇస్తోందనే ప్రచారం జరుగుతోంది. అన్ని విషయాల్లో తెలుగోళ్లను తక్కువగా చూస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.