ధియేటర్ల ఓపెనింగ్ కి ఊహించని యాక్షన్ ప్లాన్ !

Seetha Sailaja
అక్టోబర్ 1నుండి కేంద్రప్రభుత్వం ప్రకటించబోయే అన్ లాక్ కొత్త నిబంధనలలో విద్యా సంస్థలు ధియేటర్ల రీ ఓపెనింగ్ కు సంబంధించి ఒక స్పష్టమైన క్లారిటీ రాబోతోంది అన్నసంకేతాలు వస్తున్నాయి. జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం దేశవ్యాప్తంగా ధియేటర్లు రీ ఓపెన్ చేయడానికి అక్టోబర్ 15 నుండి అనుమతులు వస్తాయని తెలుస్తోంది.


అయితే ఈధియేటర్ల రీ ఓపెనింగ్ విషయంలో కేంద్రప్రభుత్వం అనుసరించబోయే కఠిన నిబంధనలు ధియేటర్ల రీ ఓపెనింగ్ కు ఎంతవరకు సహకరిస్తుంది అన్నవిషయమై ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. థియేటర్ల విషయంలో మల్టీప్లెక్సులు ముందుగా తెరుచుకుంటాయని టాక్.


మల్టీ ప్లెక్స్ లలో ముందుగా డబ్బింగ్ సినిమాలు హాలీవుడ్ మూవీలు విడుదల అవుతాయని తెలుస్తోంది. ఈసినిమాలకు కనీస సంఖ్యలో అయినా జనం వస్తున్నారు అన్ననమ్మకం ఏర్పడిన తరువాత క్రిస్మస్ కు భారీ హిందీ సినిమాలు ఆతరువాత వచ్చే సంక్రాంతి సీజన్ కు భారీ తెలుగు సినిమాలు వచ్చే ఆస్కారం ఉంది.


ఇప్పటికే రిలీజ్ కు రెడీగా ఉన్న అనేక భారీ తెలుగు హిందీ సినిమాలకు ఈ న్యూస్ ఆనందం కలిగిస్తున్నప్పటికీ వాస్తవ రూపంలో ధియేటర్లు ఓపెన్ అయ్యే పరిస్థితులు ఇప్పట్లో కనిపించడం లేదు అంటూ ఈమధ్య ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కామెంట్స్ చేయడం వెనుక ఉన్న ఆంతర్యం పై ఇప్పుడు మరిన్ని చర్చలు జరుగుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ మార్కెట్ లోకి వచ్చినా ఆ వ్యాక్సిన్ దేశజనాభాకు పూర్తిగా అందుబాటులోకి రావాలి అంటే కనీసం నాలుగు సంవత్సరాలు పడుతుంది అంటూ వస్తున్న వార్తలను లెక్క చేయకుండా ఎంతమంది ధియేటర్లకు వచ్చి సినిమాలు చూస్తారు అన్న విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ప్రస్తుతం చైనా అమెరికా ఫ్రాన్స్ ఇంగ్లాండ్ దేశాలలో ధియేటర్లు తెరుచుకున్నప్పటికీ ప్రేక్షకులు అతి తక్కువ సంఖ్యలో వస్తున్న పరిస్థితులలో మన తెలుగు రాష్ట్రాలలో ధియేటర్లు తెరిచినప్పటికీ జనం రావాలి అంటే సంక్రాంతి దాటిపోవలసిందే అన్న మాటలు వినిపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: