రియా ఎవరో నాకు.. కానీ అన్యాయం జరుగుతుంది : తాప్సి

praveen
సుశాంత్ సింగ్ రాజ్ పుత్  ఆత్మహత్య అనంతరం బాలీవుడ్ చిత్ర పరిశ్రమ లో  ఎన్నో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సీబీఐ విచారణలో భాగంగా ఎన్నో సంచలన విషయాలు బయట పడుతున్నాయి. ఈ క్రమంలోనే సుశాంత్ కేసులో డ్రగ్స్ వాడకం గురించి కూడా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చి  సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక ఈ డ్రగ్స్  వ్యవహారంపై ఓవైపు బాలీవుడ్ కాంట్రవర్షియల్ బ్యూటీ కంగనా రనౌత్.. మరికొంత మంది సెలబ్రెటీలు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తుండడం కూడా మరింత చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు ఈ వ్యవహారంపై రాజకీయ చర్చ కూడా వాడివేడిగా నే జరుగుతున్న విషయం తెలిసిందే.


 ఇలా రోజురోజుకు బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సరికొత్త పరిణామాలు వెలుగులోకి వచ్చి సంచలనం సృష్టిస్తున్నాయి. ఇటీవల ఈ పరిణామాల పై బాలీవుడ్ నటి తాప్సీ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ నటి తరచుగా వివాదాస్పదంగా మాట్లాడితే కొన్ని రోజుల తర్వాత వారు ఎంత వివాదాస్పదంగా మాట్లాడిన వారి మాటలు ఎవరి పై ప్రభావం చూపించవు... ఇలాగే కంగనా మాటలు తనపై ఎలాంటి ప్రభావం చూపలేదు అంటూ తాప్సి చెప్పుకొచ్చింది. ఇదే సమయంలో రియా చక్రవర్తి గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.


 రియా చక్రవర్తి ఎవరో తనకు తెలియదని... ఆమెతో తనకు కనీసం పరిచయం కూడా లేదు అంటూ తెలిపింది తాప్సీ. కానీ సుశాంత్ ఆత్మహత్య కేసులో ఆమె ని టార్గెట్ చేసి మరీ జరుగుతున్న అన్యాయం చూస్తుంటే మాత్రం బాధగా అనిపిస్తుంది అంటూ తాప్సీ తెలిపింది. వాస్తవంగా చెప్పాలంటే బాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ ఏదో ఒక విషయంలో ఏదో ఒక తప్పు చేశారు... కానీ వారెవరిని కూడా రియా ను  చూసినట్లుగా చూడటం లేదు అంటూ తాప్సీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా ప్రస్తుతం తాప్సీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: