ఓ తమిళ నటి దొంగ అవతారం !
కరోనా వైరస్ ప్రభావంతో అన్ని రంగాలు కుదేలయ్యాయి. ముఖ్యంగా విద్య, సినీ,టీవీ రంగాలు ముందు వరుసలో ఉన్నాయి. లాక్ డౌన్ కారణంగా గత ఆరు నెలలుగా సినిమాలు, సీరియళ్ల షూటింగులు నిలిచిపోయాయి.. దీంతో ఈ రంగాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వాళ్లు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉపాధి ఉన్నన్నాళ్లు డాబు దర్ఫంతో యధేచ్చగా ఎంజాయ్ చేశారు. అయితే కరోనా ఎఫెక్ట్‌తో ప్రస్తుతం కుటుంబ పోషణనే భారంగా మారింది. దీంతో ఓ కోలివుడ్ నటి రోజులు గడపడానికి దొంగగా మారిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ నటి ఎవరో కాదు దేవత అనే సీరియల్ తో పాటు పలు సీరియళ్లలో ముఖ్య పాత్రల్లో నటించిన సుచిత్రా.
టీవీ సీరియల్స్ లో నటనతో అందరినీ ఆకట్టుకున్న ఈ నటికి లాక్ డౌన్ కష్టాలు వెంటాడాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురవటంతో ఈజీ మని కోసం దొంగగా మారాలని ప్లాన్ వేసింది. ప్రియుడు మణికందన్ సాయంతో చోరీలకు పాల్పడింది. మణికందన్ కు చాలా ఏళ్ల క్రితమే వివాహమైంది. ఆ విషయం తెలిసి కూడా మణికందన్ తో సహజీవనం చేస్తోంది సుచిత్రా. అయితే ఇటు సీరియల్స్ లేక సుచిత్రాకు, షూటింగులు లేకుండా డ్రైవర్ మణికందన్ పనిలేకపోవడంతో ఆర్దిక ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ప్రియురాలు సుచిత్రా చెప్పిన ఫ్లాన్ ను అమలు చేసేందుకు సిద్ధమయ్యాడు. మణికందన్ తల్లిదండ్రుల ఇంట్లోనే దొంగతనం చేసేలా ఆమె ప్లాన్ చేసింది సుచిత్రా.
సుచిత్రా ప్లాన్ ప్రకారం.. కడలూరు జిల్లా పన్రుతిలో మణికందన్ సొంత గ్రామానికి చేరుకున్నారు. మణికందన్ తల్లితండ్రులు పొలం పనులకు వెళ్లడంతో.. ఇంటిలో ఉన్న 18 సవరాల బంగారంతో పాటు 50,000 రూపాయల నగదు దొంగిలించాడు. అయితే, ఇంట్లో డబ్బు, బంగారం కనిపించకపోవడంతో మణికందన్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఇప్పటికే మణికందన్ ను అరెస్ట్ చేయగా నటి సుచిత్ర మాత్రం పరారీలో ఉంది.