సుశాంత్, సారా మధ్య కరీనా కపూర్ చిచ్చుపెట్టిందని ఆరోపణలు చేసిన కంగనా!

Purushottham Vinay
గత జూన్ 14 వ తేదీన బాలీవుడ్ యువ సంచలన నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ చేసుకున్నాడు. కారణం ఏమో తెలీదు కాని ఇలా సూసైడ్ చేసుకొని యావత్ భారత దేశ ప్రజలనే షాక్ కి గురి చేశాడు. ఇందుకు రక రక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి కాని అసలు కారణం ఏమిటో ఎవరికీ తెలీదు. ప్రస్తుతం ఈ కేసు పై సిబిఐ విచారణ లో వుంది. అయితే సుశాంత్ కచ్చితంగా డిప్రెషన్ వల్లనే చనిపోయాడని తెలుస్తుంది. ఇక కంగనా కూడా ఈ విషయంలో ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంది.

ఇక విషయానికి వస్తే.. ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ రోజుకో సంచలన వ్యాఖ్యతో వార్తలలో ఉంటుంది. ఎప్పటి నుండో బాలీవుడ్ పెద్దలతో గొడవపడుతున్న కంగనా, తాజాగా మహారాష్ట్ర గవర్నమెంట్ తో సమరానికి దిగింది. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే మరియు కంగనా మధ్య పెద్ద యుద్ధమే నడుస్తుంది. ఆమె చేసిన అనేక ఆరోపణలపై మహా సర్కార్ మండిపడుతుంది. కాగా కంగనా ఈసారి హీరోయిన్ కరీనా కపూర్ ని టార్గెట్ చేశారు. కరీనా కపూర్ పై ఆమె ఓ సీరియస్ అలిగేషన్ చేయడం జరిగింది.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరియు సారా అలీ ఖాన్ మధ్య రిలేషన్ ఉండగా కరీనా కారణంగానే వారు విడిపోయారని ఆమె ఆరోపించడం జరిగింది. సారా అలీఖాన్ స్టెప్ మదర్ అయిన కరీనా కపూర్ తన మాటలతో సారా అలీఖాన్ మనసు మార్చివేశారని, సుశాంత్ తో విడిపోయేలా చేశారని కంగనా అన్నారు. ఓ ఇంటర్వ్యూలో కరీనా కపూర్ చెప్పిన సమాధానాన్ని దీనికి ఉదాహరణగా కంగనా చూపుతుంది. గతంలో కరీనా ఓ టాక్ షోలో సుశాంత్ ని కించపరిచేలా మాట్లాడారు.

హోస్ట్ సారా అలీఖాన్ కి మీరు ఇచ్చే సలహా ఏమిటని అడుగగా…నీ ఫస్ట్ మూవీ హీరోతో డేట్ కి వెళ్ళకు అని చెబుతాను అంది. ali KHAN' target='_blank' title='సైఫ్ అలీఖాన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ కేదార్ నాధ్ మూవీతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ మూవీలో హీరోగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించారు. ఒకప్పుడు సుశాంత్, సారా అలీఖాన్ తో కూడా ప్రేమాయణం నడిపారన్న సంగతి ఇటీవలే బయటికి వచ్చింది. మరి ఈ విషయం పై సారా ఎలా స్పందిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: