పవన్ ను నమ్ముకుని ఎంతగానో ఎదురుచూస్తున్న ఆ దర్శకుడు ?

Seetha Sailaja
 పవన్ కళ్యాణ్ మాట ఇస్తే ఆ మాటకు కట్టుబడి ఉంటాడు అని అంటారు. అయితే పవన్ ఒక దర్శకుడుకు మాట ఇచ్చి ఆమాట తప్పాడు అంటూ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ సినిమాతో ఇండస్ట్రీలో దర్శకుడిగా అడుగు పెట్టాడు కిషోర్ కుమార్ పార్థసాని అలియాస్ డాలీ.


ఆతర్వాత ఈదర్శకుడు నాగచైతన్యతో ‘తడాఖా’ అనే సినిమా తీసాడు. మళ్ళీ ఆతరువాత ఎవరు ఊహించని విధంగా డాలికి పవన్ కళ్యాణ్ వెంకటేష్ లతో ‘గోపాల గోపాల’ మూవీ దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. ఆ సినిమాకు మంచి ప్రశంసలు వచ్చినా పెద్దగ విజయం సాధించలేదు.



అయితే ఆ విషయాన్ని పట్టించుకోకుండా పవన్ డాలికి మరో అవకాశం ఇవ్వడమే కాకుండా తమిళ్ హిట్ మూవీ ‘వీరమ్’ మూవీని పవన్ తో ‘కాటమరాయుడు’ మూవీగా తీసే అవకాశం ఇచ్చాడు. ఈమూవీ చేస్తున్నప్పుడే పవన్ కళ్యాణ్ అతడి మేకింగ్ స్టైల్ నచ్చి అతడితో మరొక సినిమా చేస్తానని మాట ఇచ్చాడట.


దీనితో పవన్ కళ్యాణ్ మాట నమ్ముకుని డాలి పవన్ కోసం మూడు సంవత్సరాలు ఎదురు చూడటమే కాకుండా అనేక కథలు కూడ రెడీ పెట్టాడని టాక్. ఈక్రమంలో జనసేన పార్టీకి క్రియేటివ్ గా కావాల్సిన సహకారం కూడా అందించాడని తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి వరుసపెట్టి సినిమాలు చేస్తున్న పరిస్థితులలో తనకు కూడ పిలుపు వస్తుందని డాలి ఎంతో ఆశగా ఎదురు చూసాడు అని అంటారు. అయితే పవన్ కళ్యాణ్ డాలీని పక్కన పెట్టి హరీష్ శంకర్ సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం డాలికి నిరాశను కలిగించిందని గాసిప్పులు వస్తున్నాయి. ఏమైనా మాట తప్పని పవన్ కళ్యాణ్ డాలి విషయంలో ఎందుకు ఇలా చేసాడు అంటూ ఇండస్ట్రీలోని కొందరు డాలి పై సానుభూతి చూపిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: