నా ఈగో హర్ట్ అయ్యింది.. ఇక నుండి అతని సంగతి చూస్తా..!

shami
బిగ్ బాస్ సీజన్ 4 సెకండ్ వీకెండ్ హంగామా బాగుంది. శనివారం నామినేషన్స్ కు సీరియస్ గా తీసుకోవడం లేదని నాగార్జున హౌజ్ మేట్స్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. ఆటని ఆటలానే ఆడాలని.. సేఫ్ గేమ్ పనికిరాదని చెప్పారు నాగ్. అంతేకాదు ఈ వారం ఇద్దరు ఎలిమినేట్ అవుతారని చెప్పిన నాగ్ మొదటి ఎలిమినేటర్ గా కరాటే కళ్యాణిని బయటకు పంపించారు. ఇక సెకండ్ ఎలిమినేషన్ గా హారిక, మోనాల్ లో ఒకరు ఎలిమినేట్ చేయాలని హౌజ్ మేట్స్ మీద పెట్టాడు నాగార్జున.    
లాస్ట్ వీక్ నామినేషన్స్ లో లేని ఏడుగురు హౌజ్ మేట్స్ హారిక, మోనాల్ లో ఒకరిని సేవ్ చేయాలని అన్నారు. అయితే 3 హారికకు, 3 మోనాల్ కు ఓట్ వేయగా ఫైనల్ గా సుజాత కూడా మోనాల్ కు ఓటు వేయడంతో హారిక ఎలిమినేట్ అని ఎనౌన్స్ చేశాడు నాగార్జున. సరిగ్గా గేట్ దగ్గరకు వెళ్లాక ఆమెని సేవ్ చేశాడు. నామినేషన్స్ ను సీరియస్ గా తీసుకోవాలని చెప్పేందుకు ఇలా చేసినట్టు చెప్పారు నాగార్జున.
ఇదిలాఉంటే సోమవారం ఎపిసోడ్ ప్రోమోలో తనని సిల్లీ రీజన్ చెప్పి ఎలిమినేట్ చేయాలని చూసిన మెహబూబ్ ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసింది హారిక. వేరే రీజన్ ఏది చెప్పినా యాక్సెప్ట్ చేసేద్దాన్ని కాని అలా కాకుండా తన ఈగోని టచ్ చేసిన మెహబూబ్ సంగతి చూస్తానని చెప్పింది. ప్రోమోలో అమ్మా రాజశేఖర్ దేవి నాగవల్లి గురించి మరో ఇంటి సభ్యులతో మాట్లాడుతున్నట్టు చూపించారు. మొత్తానికి ఈరోజు కూడా హౌజ్ లో సందడి బాగానే ఉండేలా కనిపిస్తుంది.                  
   

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: