మ్యూజిక్ పై కరోనా ఎఫెక్ట్.. !
'అల వైకుంఠపురములో' ఆల్బమ్ సూపర్ హిట్ అయినప్పుడు అల్లు అర్జున్ ఒక మాట చెప్పాడు. ఈ ఆల్బమ్ ఇంత సూపర్ హిట్ అవ్వడానికి మ్యూజిక్ బ్యాండ్స్ కూడా ఒక కారణమని చెప్పాడు. ఇప్పటి జనరేషన్‌ని మెప్పించే పాటలు, మ్యూజిక్ బ్యాండ్స్ అన్నీ ప్లే చేసుకునే రేంజ్ సాంగ్స్ కావాలనే లక్ష్యంతో ఈ పాటలు కంపోజ్ చేయించామని చెప్పాడు.
అల్లు అర్జున్ ఇంత గొప్పగా చెప్పిన మ్యూజిక్ బ్యాండ్స్ ఇప్పుడు కరోనా కష్టాలను ఎదుర్కొంటున్నాయి. వీకెండ్స్ వస్తే ఈవెంట్స్ తో బిజీగా ఉండే చాలా మ్యూజిక్ బ్యాండ్స్ కోవిడ్‌తో ఒక రకమైన జోన్లో ఉన్నాయి. చేయి చేయి కలపకురా అని కరోనా అవేర్నస్ సాంగ్ పాడిన చౌరస్తా మ్యూజిక్ బ్యాండ్ నుంచి మొదలుపెడితే హైదరాబాద్‌లో ఉన్న మ్యూజిక్ బ్యాండ్స్ అన్ని కొంచెం సైలెంట్ అయినట్లే కనిపిస్తున్నాయి.
చౌరస్తా మ్యూజిక్ బ్యాండ్ ఎక్కువగా సోషల్ ఎవేర్నెస్ సాంగ్స్‌ని క్రియేట్ చేస్తుంటుంది. అలాగే సరదాపాటలతో హుషారెత్తిస్తుంది. జమైకా మ్యూజిక్ జానర్ రేగే స్టైల్లో, వెస్ట్రన్ మ్యూజిక్‌ని జానపద పాటలని మిక్స్ చేస్తుంది. ఈ పాటలతోనే ప్రేక్షకులని మెప్పిస్తోంది చౌరస్తా బ్యాండ్.
కష్టకాలాన్ని అవకాశంగా మార్చుకున్నప్పుడు కెరీర్ బ్లాక్ బస్టర్ అవుతుంది అంటారు. ఇప్పుడు చాలా మ్యూజిక్ బ్యాండ్స్ ఇదే పనిలో ఉన్నాయి. కరోనా బ్రేక్‌లో కొత్త కొత్త సాంగ్స్‌ని రీక్రియేట్ చేస్తున్నారు. మెలోడీ సాంగ్స్‌కి కొత్త కొత్త కోటింగ్స్ ఇస్తున్నారు.
ప్లే బ్యాక్ సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఈ మ్యూజిక్ బ్యాండ్స్ లో కలుస్తున్నారు. ట్రెండ్‌ని క్యాష్ చేసుకుంటున్నారు. సాయి కార్తీక్, అచ్చు లాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గ్రర అసిస్టెంట్‌గా పనిచేసి, 'కారందోశ' సినిమాకి మ్యూజిక్ ఇచ్చిన సిద్ధార్ధ్ కూడా మ్యూజిక్ బ్యాండ్ స్టార్ట్ చేశాడు. 'అభేరి' పేరుతో బ్యాండ్ స్టార్ట్ చేసి, 90ల్లో వచ్చిన ఇళయరాజా పాటలని రీక్రియేట్ చేస్తున్నాడు. కొత్త కంటెంట్‌తోనూ మెప్పించడానికి ప్రయత్నిస్తున్నాడు సిద్ధార్థ్.