బిగ్ బాస్ 4 : రెడ్ జోన్ లో ఆ ఇద్దరు.. ఎలిమినేట్ అయ్యేది ఎవరు..?
కుమార్ సాయి తర్వాత వచ్చిన అవినాష్ హౌజ్ మేట్స్ తో కలిసిపోతే కుమార్ సాయి మాత్రం ఇంకా సెపరేట్ గా ఉంటున్నాడు. వచ్చిన మొదటివారమే నామినేషన్స్ లో ఉన్న కుమార్ సాయి లాస్ట్ వీక్ సేఫ్ అవగా ఈ వారం కూడా నామినేషన్స్ లో ఉన్నాడు. ఒకానొక దశలో హౌజ్ మేట్స్ అంతా అతన్ని టార్గెట్ చేస్తున్నారా అన్న విధంగా పరిస్థితి ఉంది. అయితే ఈ వారం కూడా అతను సేవ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. ఈ వారం నామినేషన్స్ లో ఉన్న లాస్యని కూడా సేవ్ చేస్తారు. మెహబూ కూడా టాస్కుల్లో తన 100 పర్సెంట్ ఇస్తూ దూసుకెళ్తున్నాడు. అతన్ని కూడా ఆడియెన్స్ సేవ్ చేస్తారని అనిపిస్తుంది. ఇక మోనాల్, హారికలు లాస్ట్ వీక్ కూడా నామినేషన్స్ లో ఉన్నారు. ఈ వారం కూడా వారు సేఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.
ఎటొచ్చి దేవి నాగవల్లి, అరియానాలకే ఈ వారం టఫ్ గా ఉండబోతుందని అనిపిస్తుంది. అందరిది ఒకదారి తనదో దారి అన్నట్టుగా దేవి, అరియానాల ప్రవర్తన ఉంది. దేవి అయినా కొద్దిగా హౌజ్ మేట్స్ తో కలుస్తుంది కాని అరియానా అందరికి శత్రువుగా మారుతుంది. నామినేషన్స్ లో సోహైల్ ఆ తర్వాత అభిజిత్, అమ్మా రాజశేఖర్ కూడా ఆమెని నామినేట్ చేయడం చూస్తే అరియానా డేంజర్ జోన్ లో ఉన్నట్టే అని తెలుస్తుంది. అరియానా, దేవి వీరిద్దరిలోనే ఈ వారం ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు చెప్పుకుంటున్నారు.