మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో ప్రభాస్ కి ఎందుకంత అయోమయం..?

P.Nishanth Kumar
రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తో ఏ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడో అందరికి తెలిసిందే.. ఆ సినిమా తో పాన్ ఇండియా సినిమాలు చేసే స్థాయికి ప్రభాస్ ఎదిగిపోయాడంటే ఆ సినిమా కి ఆయన పడ్డ కష్టం అని చెప్పొచ్చు.. అయితే ఆ సినిమా తర్వాత వచ్చిన సాహో సినిమా పరాజయం ఆయనను పునరాలోచించుకునేలా చేసింది. అందుకే సాహో తర్వాత తాను చేయబోయే సినిమా లపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాడు..సాహో విషయంలో చేసిన పొరపాట్లను మళ్ళీ పునరావృతం అయ్యేలా చేసుకోకూడదు అని భావిస్తున్నారు..అందుకే ప్రస్తుతం చేస్తున్న రాధే శ్యామ్ సినిమా పై స్పెషల్ ఫోకస్ చేస్తున్నాడు..

ఓ వైపు ప్రభాస్ ఈ సినిమా ని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా, త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది.అయితే సాహో వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా సినిమా రిలీజ్ విషయంలో ఎలాంటి అప్ డేట్ ఇవ్వకపోవడం తో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు..  ఒకరకంగా డైరెక్టర్ రాధాకృష్ణ పై ఫాన్స్ కొంత ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తుంది.. ప్రభాస్ లాంటి స్టార్ హీరో తో బాహుబలి తీసినట్లు ఇలా సంవత్సరాలకు సంవత్సరాలు సినిమా చేయడం ఎంత వరకు కరెక్ట్ అని సోషల్ మీడియా లో విమర్శలు చేస్తున్నారు..  

ఇక తన సినిమా మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో ప్రభాస్ ఎందుకంత కన్ ఫ్యుజ్ అవుతున్నారో అర్థం కావట్లేదు. ఇప్పటికే మూడు నాలుగు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి కానీ యూనిట్ నుంచి మాత్రం ఎలాంటి సమాచారం లేదు. ఎదో టాలీవుడ్ లో కరువు ఉన్నట్లు  ఫామ్ లో ఉన్న థమన్ లేదా దేవిలాంటి వాళ్ళనో తీసుకోకుండా ఎందుకు ఆలస్యం చేస్తున్నారనే సందేహం రావడం సహజం. వాస్తవానికి గత కొన్ని సినిమాలుగా ప్రభాస్ మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో ఎందుకు అయోమయం అవుతున్నారో అర్థం కావట్లేదు.. మరి రాధేశ్యామ్ కు ఫ్లూట్ వాయించేది ఎవరో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: