తెలుగు సినిమాలకి సై అంటున్న బాలీవుడ్ భామ...!

Suma Kallamadi
బాలీవుడ్ హీరోయిన్లు తెలుగు సినిమాల్లో నటించడం కొత్తేమి కాదు. తెలుగు నటులు బాలీవుడ్ లో నటించడం అలానే హిందీ నటులు తెలుగు సినిమాలు చెయ్యడం సాధారణమే కదా...! ఇప్పటికే అనేక మంది హిందీ హీరోయిన్లు తెలుగు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు సయీ మంజ్రేకర్‌ కి తెలుగు సినిమాల్లో నటించడానికి పచ్చ జెండా ఊపింది. ఇప్పుడు ఈ బ్యూటీ తన నటనని తెలుగు ప్రేక్షకులకి చూపించనుంది. తెలుగు చిత్రాల్లో  నటించిన నటుడు , దర్శకుడు మహేశ్‌ మంజ్రేకర్‌ కుమార్తె సయీ మంజ్రేకర్‌.  


ఈమె రానున్న  ‘మేజర్‌’ చిత్రం ద్వారా తెలుగు తెర మీదకి రానుంది. ఈమె సల్మాన్‌ ఖాన్‌ ‘దబాంగ్‌–3’ చిత్రం తో పరిచయమై అందర్నీ ఆకట్టుకున్నారు. మరి ఇప్పుడు ఈమె తెలుగు ప్రేక్షకులని కూడా ఆకట్టుకుంటారనడంలో విశేషం ఏమి లేదు. ‘మేజర్‌’ సినిమా షూటింగ్‌ అక్టోబర్‌ నెల లో హైదరాబాద్ ‌లో జరగనున్నది. దానిలో ఈమె పాల్గొనున్నారు. ఈ చిత్రం మేజర్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా రూపొందిస్తున్నారు. 2008 నవంబర్‌ 26 న జరిగిన ముంబై టెర్రరిస్ట్‌ దాడుల్లో ఆయన మృతి చెందారు. మరి ఆయన జీవితం మీద ఆధారపడి ఉండే సినిమాని తీసుకు రావడం గొప్ప ప్రయత్నం అనే చెప్పాలి.

ఈ సినిమా పూర్తి వివరాల్లోకి వెళితే.... శేష్‌ అడివి ఉన్నికృష్ణన్‌ పాత్రలో నటించగా, శోభిత దూళిపాళ్ల హీరోయిన్ గా నటిస్తోంది‌. ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్‌ది కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. నిజంగా ఈ చిత్రం ప్రేక్షకులని ఆకట్టుకునేలా ఉంటుందేమో అని టాక్. శశి కిరణ్‌ తిక్క ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా  జి.యం.బి ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకం పై మహేశ్‌బాబు, సోనీ పిక్చర్స్, ఏప్లస్‌ ఎస్‌ మూవీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  
 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: