బాలీవుడ్ లో శభాష్ అనిపించుకున్న మహా వ్యక్తి..!

NAGARJUNA NAKKA
తెలుగులో క్షణం తీరిక లేకుండా సినిమా పాటలు పాడుతున్న సమయంలోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు బాలసుబ్రహ్మణ్యం. తొలి హిందీ సినిమా ద్వారా తన సత్తా ఏంటో చాటి చెప్పారు. అప్పటి వరకూ ఓ మూసగా సాగిపోతున్న బాలీవుడ్‌ పాటలను మరో మలుపు తిప్పారు.

దేశవ్యాప్తంగా కోట్ల మంది శ్రోతలను అలరించడానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి బాలీవుడ్‌ ఓ చక్కటి వేదికగా ఉపయోగపడింది. 1981లో ఏక్‌ దూజే కే లియే సినిమా ద్వారా తన  మధురమైన స్వరాన్ని హిందీవారికి పరిచయం చేశారు. తెలుగులో సూపర్‌ డూపర్‌ హిట్‌ అయిన మరో చరిత్ర హిందీ రీమేకే ఏక్‌ దూజే కే లియే. ఇందులో కూడా కమల్‌ హాసనే హీరో. రొమాంటిక్‌ సాంగ్స్‌ అద్భుతంగా పాడారు.

ఎంట్రీతోనే హిందీలో తన మార్క్‌ చాటుకున్న బాలసుబ్రహ్మణ్యానికి  ఏక్‌ దూజే కే లియే చిత్రం జాతీయ ఉత్తమ నేపథ్య గాయకుడిగా అవార్డు తెచ్చిపెట్టింది. అటు నుంచి ఎస్పీ వెనుతిరిగి చూసుకోలేదు. తెలుగు, కన్నడ, తమిళ సినిమాల్లో బిజీగా ఉన్నా.. హిందీ పాటలకు కూడా సమయం కేటాయించక తప్పలేదు. క్రమంగా బాలీవుడ్‌లోనూ తీరిక లేకుండా ఆయన ప్రయాణం సాగింది.

పదేళ్లు వెనుతిరిగి చూడలేదు. ముఖ్యంగా కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ హీరోగా నిలదొక్కుకుంటున్న సమయంలో ఎస్బీ బీ గాత్రం.. ఆ సినిమాల విజయానికి కారణమయ్యాయి. సల్మాక్‌ కెరీర్‌లో సూపర్‌ డూపర్‌ హిట్‌ ఫిల్మ్‌ మైనే ప్యార్‌ కియాలో అద్భుతమైన పాటలు పాడారు బాలు. ఈ సినిమాలో ఎస్పీ పాడిన రొమాంటిక్‌ సాంగ్స్‌ ఇప్పటికీ  లవర్స్‌ దిల్‌ దివానా అంటూనే ఉంటుంది.

ఏక్‌ దూజే కే లియే సినిమా మాదిరే.. ఎస్పీ ఎక్కడ ప్రదర్శన ఇచ్చినా దిల్‌ దివానా పాట హైలైట్‌గా ఉండేది. ఈ సాంగ్‌కు కూడా బాలసుబ్రహ్మణ్యం జాతీయ ఉత్తమ నేపథ్య గాయకుడిగా అవార్డు అందుకున్నారు. అవార్డు అందుకుంటున్న సమయంలోనూ ఎస్పీని అడిగి పాట పాడించుకున్నారంటే ఆ సాంగ్‌ ఏ స్థాయిలో హిట్‌ అయిందో అర్థం చేసుకోవచ్చు. కుటుంబ సమేతంగా వచ్చిన ప్రేమ కథా చిత్రాలలో సైతం బాలసుబ్రహ్మణ్యం పాటలు ఎంతో మధురంగా ఉండేవి. దీనికి  ఉదాహరణే హమ్‌ ఆప్‌కే హై కౌన్‌. బాలీవుడ్‌ గానకోకిల లతామంగేష్కర్‌తో కలిసి ఎస్పీ పాడిన పాటలు ఈ చిత్రానికి హైలైట్‌.








మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: