అఖిల్ తో పాటు ఆయనకు కూడా బ్రేక్ గ్యారెంటీ అట ...??

GVK Writings
అక్కినేని ఫ్యామిలీ నుండి ఇటీవల హీరోలుగా ఇచ్చిన మూడోతరం నటులైన అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్ ప్రస్తుతం వరుస సినిమాలతో టాలీవుడ్ లో కొనసాగుతున్నారు. కాగా వారిలో ఇప్పటికే నాగచైతన్య జోష్ మూవీ తో తన కెరీర్ ప్రారంభించి, ఆ తరువాత నుండి మంచి సక్సెస్ లు అందుకని హీరోగా దూసుకెళ్తున్నాడు. అలానే అఖిల్ సినిమాతో ప్రారంభమయిన హీరోగా అఖిల్ సినీ కెరీర్ లో మాత్రం ఇప్పటి వరకు నటించిన మూడు సినిమాలతో ఆశించిన రేంజ్ సక్సెస్ అయితే లభించలేదు.

ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. వీసా సక్సెస్ ల భామ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ఎస్ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన ఒక లిరికల్ సాంగ్ యూట్యూబ్ లో రిలీజ్ అయి ప్రేక్షకుల నుండి మంచి స్పందన రాబట్టింది. శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థ కు అందుతున్న సమాచారాన్ని బట్టి మంచి లవ్ స్టోరీ గా హృద్యమైన అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా లో అక్కినేని అభిమానుల తోపాటు సాధారణ ప్రేక్షకులు అందర్నీ కూడా ఆకట్టుకునేలా పలు కమర్షియల్ హంగులు జోడిస్తున్నాడట దర్శకుడు భాస్కర్. సినిమా లోని సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఫైట్స్, యాక్షన్ రొమాంటిక్ సీన్స్ వంటివి అదిరిపోతాయని, మొత్తంగా రేపు రిలీజ్ తర్వాత ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా కెరీర్ పరంగా హీరో అఖిల్ తో పాటు దర్శకుడుగా భాస్కర్ కు కూడా పెద్ద బ్రేక్ అవ్వడం ఖాయం అంటున్నారు. మరి ఇదే కనుక నిజమైతే అక్కినేని ఫ్యాన్స్ కి ఇది నిజంగా పెద్ద పండుగ వార్త అనే చెప్పాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: