బిగ్ బాస్ 4 : అఖిల్, మోనాల్ ల పత్తేపారం నాగార్జునకు తెలిసింది..!
శనివారం ఎపిసోడ్ లో మోనాల్, అఖిల్ ఇద్దరు మ్యాచిన్ డ్రెస్ లు కూడా వేసుకున్నారు. ఇద్దరు అనుకుని యెల్లో వేసుకున్నారని తెలుతుంది. ఇక అన్నం తినిపించడాలు.. హగ్గులు ఇలాంటివి చాలా కామన్ అయ్యాయి. అఖిల్ తో ఎక్కువసేపు స్పెండ్ చేస్తుంది మోనాల్ అది ఆమె ఆటని అనుకోవాలో లేక నిజంగానే ఆమె అతనికి దగ్గ్రైందని అనుకోవాలో తెలియట్లేదు.
ఇక మరోపక్క నిన్న హారిక, అభిజిత్ ల గురించి కూడా లేవనెత్తాడు నాగార్జున. ఉక్కు హృదయం టాస్క్ లో అభిజిత్ ఫుల్ ఛార్జ్ అయ్యాక అందరు ఉండగా హారికకే ఎందుకు ఛారంజింగ్ పెట్టారని అడిగాడు నాగ్. అందరు క్లాప్స్ కొట్టారు. ఈ క్లాప్స్ కొట్టడం వెనుక అర్ధం ఏంటని తికమక పెట్టాడు నాగ్. మొత్తానికి హౌజ్ లో రెండు జంటలు తమ జోరు కొనసాగిస్తున్నాయని చెప్పొచ్చు.
ఇక కుమార్ సాయి పెట్టిన చిచ్చు వల్ల హోస్ట్ నాగార్జున ముందే అఖిల్, అభిజిత్ ల వాదన మొదలైంది. అఖిల్ తన కన్నా చిన్న వాడు అయినా అరేయ్ అన్నందుకు అభిజిత్ ఫీల్ అయ్యాడని కుమార్ సాయి చెప్పడంతో అఖిల్ అభిజిత్ మీద సీరియస్ అయ్యాడు.