గంగవ్వతో బిగ్ బాస్ కాంట్రాక్ట్.. బిగ్ డీల్..?

shami
బిగ్ బాస్ సీజన్ 4లో స్టార్ కంటెస్టంట్ గా వచ్చిన గంగవ్వ తన సత్తా చాటుతుంది. హౌజ్ లో అంతా యువకులు ఉన్నారు.. అయినా సరే గంగవ్వ తన ఆటతీరు.. మాట తీరుతో ఆకట్టుకుంటుంది. మొదటివారం కొద్దిగా నీరస పడినట్టు అనిపించిన గంగవ్వ. ఇప్పుడు అంతా సెట్ రైట్ అయ్యింది. బిగ్ బాస్ ఇచ్చిన టాస్కుల్లో కూడా గంగవ్వ తన ప్రదర్శనతో మెప్పిస్తుంది. బిగ్ బాస్ లో గంగవ్వ రావడం బయట ఆడియెన్స్ కు మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకుంది.
అంతేకాదు బిగ్ బాస్ లో తనంతట తాను రావడమే తప్ప బయట ఆడియెన్స్ అంతా ఆమెకు సపోర్ట్ గా నిలుస్తారని చెప్పొచ్చు. అయితే లేటెస్ట్ గా బిగ్ బాస్ నిర్వాహకులు గంగవ్వతో భారీ డీల్ ఏర్పరచుకున్నారట. గంగవ్వని రెండు నెలలు హౌజ్ లో ఉంచేలా ప్లాన్ చేశారట. ఆమె ఉండటం వల్ల హౌజ్ కు విలేజ్ ఆడియెన్స్ ఎక్కువ చూసే అవకాశం ఉందని. అలా రెండు నెలల ఫుల్ కాంట్రాక్ట్ తో గంగవ్వ హౌజ్ లోకి వచ్చినట్టు తెలుస్తుంది. ఇంతకీ గంగవ్వ వారితో ఏం కాంట్రాక్ట్ ఏర్పరచుకుంది అంటే తనకు ఇల్లు కట్టివ్వమని చెప్పిందట.
అందుకు బిగ్ బాస్ నిర్వహాకులు ఆమెకు అగ్రిమెంట్ తోనే హౌజ్ లోకి పంపించినట్టు తెలుస్తుంది. ఒకవేళ గంగవ్వ ఈలోగా హౌజ్ నుండి ఏ కారణాల వల్లైనా హౌజ్ నుండి వస్తే ఆమెకు కొంత రెమ్యునరేషన్ ఇస్తారట. సో మొత్తానికి గంగవ్వ తన సొంతింటి కోరిక నెరవేరాలంటే మాత్రం రెండు నెలలు హౌజ్ లో ఉండాల్సిదే అన్నమాట. మరి గంగవ్వ రెండు నెలలు హౌజ్ లో ఉంటుందా లేదా అన్నది చూడాలి. ఇప్పటికే 3 వారాలు పూర్తయ్యాయి కాబట్టి గంగవ్వ మరో నెల రోజులు ఉంటే తప్పకుండా ఆమె అనుకున్న ఇల్లు ఆమె సొంతం అయ్యే అవకాశం ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: