ఇక్కడ సినిమాకే అంత టైం.. ఇక పాన్ ఇండియా సినిమా అంటే..?

shami
సూపర్ స్టార్ మహేష్ కేవలం టాలీవుడ్ లోనే సినిమాలు చేసినా ఆయన క్రేజ్ బాలీవుడ్ కు పాకింది. మహేష్ సినిమా హిట్టు కొడితే ఎలా ఉంటుందో ఆ లెక్క అందరికి తెలిసిందే. కెరియర్ లో చేసిన 26 సినిమలకే హిట్లు ఫ్లాపులు సమానంగా రుచి చూసిన మహేష్ బాబు వరుస ఫ్లాపుల వల్ల మహేష్ జాగ్రత్త పడుతూ వచ్చాడు. ఎలాంటి మొహమాటాలకు లేకుండా సినిమా కథ నచ్చితేనే సినిమా ఓకే చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. బ్రహ్మోత్సవం తర్వాత కథల విషయంలో జాగ్రత్త వహిస్తున్నాడు.
అందుకే భరత్ అనే నేను నుండి తన పంథా మార్చేశాడు. ఆ సినిమాతో హిట్ అందుకోవడమే కాకుండా ఆ తర్వాత మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలు సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత వంశీ పైడిపల్లి తో సినిమాని చివరి నిమిషంలో క్యాన్సిల్ చేసుకుని పరశురాం తో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. అయితే మహేష్ తో పాన్ ఇండియా మూవీ చేయాలని డైరక్టర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఇక్కడ సినిమా చేయడానికే ఇంతగా ఆలోచిస్తున్న మహేష్ పాన్ ఇండియా సినిమా అంటే ఎంతగా ఆలోచిస్తాడు. అలా చేయాలంటే సినిమా కథ మీద ఇంకా ఎక్కువ నమ్మకం పెట్టాల్సి ఉంటుంది. రాజమౌళి సినిమాతోనే మహేష్ నేషనల్ వైడ్ సినిమా చేసే అవకాశం ఉందని అంటున్నారు. పాన్ ఇండియా మూవీ కోసం మహేష్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నా అందుకు తగిన కథ రావడం లేదని తెలుస్తుంది. మరి మహేష్ రాజమౌళి సినిమాతోనే పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తాడా లేక మరో దర్శకుడితో అలాంటి సినిమా చేస్తాడా అన్నది చూడాలి.                                        

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: