ప్లీజ్.. డబ్బులు అడగకండి.. సోను సూద్ రిక్వెస్ట్..?

praveen
సినిమాలో అతనొక విలన్... సినిమాలు చూసే వారికి వీడు  ఏంట్రా బాబు ఇలా ఉన్నాడు... మరీ ఇంత శాడిస్టిక్ గా ఉన్నాడు అని అనుకుంటారు. కానీ నిజ జీవితంలో మాత్రం నిజమైన హీరోగా మారిపోయాడు. ఇప్పుడు అతన్ని చూసిన అందరూ మనిషి అంటే ఇలా ఉండాలి... మనసున్న మనిషి కి మారుపేరు అతనే  అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అతనెవరో కాదు ప్రస్తుతం అందరి పాలిట ఆపద్బాంధవుడిగా మారిపోయిన సోను సూద్. ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా సోను సూద్  హాట్ టాపిక్ గా మారిపోయిన విషయం తెలిసిందే. కరోనా  వైరస్ సంక్షోభం మొదలైనప్పటి నుంచి తన పెద్ద మనసు చాటుకుంటూనే ఉన్నారు సోను సూద్.




 కేవలం వలస కార్మికులకు మాత్రమే కాదు... సహాయం కావాలన్నా ఎంతోమందికి చేయూతనిచ్చేందుకు ముందుకు వచ్చారు. అంతేకాదు విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేందుకు కూడా సిద్ధమయ్యారు సోను సూద్. సోనుసూద్ గొప్ప మనసు పై  దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తున్న  విషయం తెలిసిందే. అయితే ముఖ్యంగా విద్యార్థులకు చేయూతనిచ్చేందుకు ముందుకు కదిలిన సోనూ  కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఒక ట్రస్టు ద్వారా విద్యార్థులందరికీ స్కాలర్ షిప్ లు  అందించేందుకు నిర్ణయించాడు.



 ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న నిరుపేదల అందరికీ ప్రత్యక్ష దైవం గా మారిపోయారు.  అయితే ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో  ఎక్కడ చూసినా ఆన్లైన్ తరగతులు జరుగుతున్న నేపథ్యంలో ప్రైవేట్ స్కూల్స్, కాలేజీ యాజమాన్యాలకు ఓ విజ్ఞప్తి చేశారు సోనూ సూద్.  ఫీజు డబ్బులు కట్టాలి అంటూ  విద్యార్థులను బలవంతం చేయకండి అంటూ కోరాడు. పేద విద్యార్థులకు ఫీజులు డిపాజిట్ చేయకపోతే దయచేసి వారికి ఆన్లైన్ క్లాసులు నిలిపివేయకండి అంటూ విజ్ఞప్తి చేశాడు. దయచేసి వారికి ఫీజు చెల్లించేందుకు కొంత సమయం ఇవ్వండి... ఈ చిన్న సాయం విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తుకు  ఉపయోగపడుతుంది అంటూ సోను సూద్ విజ్ఞప్తి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: