నెట్టింట్లో ఆకట్టుకుంటున్న నమిత తన భర్త రొమాంటిక్ పిక్స్....
కొన్నాళ్ల తరువాత ప్రభాస్ ‘బిల్లా’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చినా.. ‘సింహా’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రంలో నటించినా ఈమెకు కలిసొచ్చిందేమి లేదు. తరువాత ఈమె విపరీతంగా బరువు పెరగడంతో అనేక విమర్శలు కూడా ఎదుర్కొంది. ఇక ఫేడౌట్ అయిపోయే స్టేజిలో కోలీవుడ్ కు చెందిన వీరేంద్ర చౌదరిని ప్రేమించి 2017లో తిరుపతిలో పెళ్లి చేసుకుంది నమిత.అప్పటి నుండీ సినిమాలకు దూరంగా.. సోషల్ మీడియాకు దగ్గరగా ఉంటూ వస్తోంది నమిత.
ఇటీవల ఆమె 4వ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా.. తన భర్తతో సరదాగా గడుపుతున్న ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలలో నమిత తన భర్త వీరేంద్ర చౌదరికి ఘాటు ముద్దు పెడుతున్న ఫోటో ఒకటి హైలెట్ అయ్యిందని చెప్పొచ్చు. మొన్నటికి మొన్న కొన్ని వర్కౌట్లు చేసి బరువు తగ్గిన నమిత.. ఇప్పుడు మళ్ళీ పెరిగినట్టు ఈ ఫోటోలు చూస్తే స్పష్టమవుతుంది.ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.. మీరు కూడా ఓ లుక్కెయ్యండి.