సోషల్ మీడియాలో వైరల్ గా మారిన రష్మీక బీచ్ వర్కౌట్స్ వీడియో..!

Anilkumar
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్లలో రష్మీకా మందన్నా ఒకరు. తెలుగులో ఛలో సినిమాతో అరంగేట్రం చేసిన ఈ అమ్మడు, ఆ సినిమాలో తన అందం, అమాయకత్వంతో అందరిని ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన గీతా గోవిందం సినిమాతో అందరి దృష్టినీ తన వైపుకు తిప్పుకుంది. అక్కడితో ఆమె దశ తిరిగింది. ఏకంగా అగ్ర హీరోల సరసన నటిస్తూ, ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయిపోయింది.

ఇప్పుడు ఈ భామ ఒక్కో సినిమాకు కోటి రూపాయల పారితోషకం తీసుకుంటుంది. ఇదిలా ఉంటె ఈమె ఇటు సినిమాలతో పాటు తన ఫిజిక్ విషయంలో కూడాఎంతగానో కష్టపడుతుంది. రష్మిక ఆహార నియమాలు పాటించడంతో పాటు రెగ్యులర్ ఉదయాన్నే బీచ్ లో వర్కౌట్స్ చేస్తుంది. కొన్ని రోజుల క్రితం బీచ్ వీడియోను షేర్ చేసిన రష్మిక తాజాగా మరో బీచ్ వర్కౌట్ వీడియోను షేర్ చేసింది.తాజా వీడియోలో రష్మిక చేతిలో చాలా బరువైన వెయిట్ ను పట్టుకుని ఇసుకలో నడుస్తూ వెళ్తుంది. ఇంకా ఆమె పలు రకాల వర్కౌట్స్ చేయడంతో పాటు కుక్కతో కూడా సరదాగా కొంత సమయంను గడిపింది.సోషల్ మీడియాలో రష్మిక షేర్‌ చేసిన ఆ వీడియో ప్రస్తుతం నెటింట్లో వైరల్‌ అవుతోంది.

 హీరోయిన్స్ సరైన ఫిజిక్ ను కాపాడుకోవాలంటే.. ఈ మాత్రం కష్టపడాల్సిందేనంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వెలువడుతున్నాయి.  ఇక ప్రస్తుతం రష్మీక మందన్నా, అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.2021 వేసవి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.ఇక వీటితో పాటు తమిళంలో ఒక సినిమా,కన్నడంలో ఓ సినిమా కి ఓకే చెప్పింది రష్మీక.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: